ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరో లుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున వీరు నలుగురు ఇప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకుంటూ మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నలుగురు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో పోల్చుకుంటే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కాస్త తక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే మరో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు ఆయన బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.

అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఒక వెబ్ సిరీస్ లో కూడా వెంకటేష్ నటించాడు. మరి కొన్ని రోజుల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా నాగార్జున నటించబోయే సినిమాలకు సంబంధించిన ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఇలా ఈ ముగ్గురు స్టార్ సీనియర్ హీరోలతో పోలిస్తే నాగార్జున కాస్త వెనుకబడి పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: