నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా కార్తికేయ2. ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ఆగస్టులో.  ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.  అంతకు ముందు ఆయన నటించిన కార్తికేయ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతో దానికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. యూత్ ఫుల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఈ హీరో నుంచి వస్తున్న మరొక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి దీనిపై ఇంతటి మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు.

హ్యాపీ డేస్ సినిమా తో ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టాడు ఈ హీరో. అప్పటినుంచి ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ హీరో కార్తికేయ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా విజయవంతం అవడంతో అలాంటి సినిమా ఒకటి చేయాలనే డిమాండ్ అందరిలో నెలకొంది. ఈ క్రమంలోనే ఈ సినిమా యొక్క సీక్వెల్ చేయాలనీ అయన నిర్ణయించారు. దీనికి కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు మొండేటి ని ఎంచుకున్నాడు.  అనుపమ పరమేశ్వరన్ ను ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తూ ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులకు విపరీతంగా ఆలరించాయి. 

ప్రేమమ్ అనే ఓ అందమైన కావ్యాన్ని రూపొందించి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం యొక్క చిత్రీకరణ ఎప్పుడు పూర్తయిన కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయాన్ని తీసుకుంది. పలు వాయిదాల తర్వాత ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నాడు విశేషం. మరి విడుదల తర్వాత ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. కార్తికేయ సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను వేరే స్థాయి లో అలరిస్తుండా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: