విరాటపర్వం సినిమా తర్వాత నేచురల్ బ్యూటీగా పేరుపొందింది సాయి పల్లవి. ఈమె నటించిన చివరి చిత్రం గార్గి. డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కోర్టు డ్రామా నేపథ్యం లో తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా గత నెల 15న థియేటర్లలో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచిగానే వస్తువులను రాబట్టింది అయితే అనుకోకుండా అత్యాచారం కేసులో ఇరుక్కున్న తన తండ్రిని కాపాడుకొని యువతి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక ఈ సినిమాతో సాయి పల్లవి నటనకు ప్రశంసలు అందుకున్నది.


అయితే ఇప్పుడు ఈ సినిమా గార్గి అప్పుడే ఓటీటి లో విడుదల అయ్యేందుకు సిద్ధమయ్యింది. ఆగస్టు 12న ప్రముఖ ఓటీటి సంస్థ సోనీ లీవ్ లో ట్రిమ్మింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని సదరు ఓటిటి సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. కాగా గార్గి సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించడంతో భారీ మొత్తంలో కూడా కొనుగోలు చేసినట్లుగా సమాచారం. అందుచేతనే ఓటీపీ విడుదల తేదీని ఖరారు చేస్తూ.. థ్రిల్లింగ్ ,ఎలివేన్స్ ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉండేలా ఒక వీడియో ను విడుదల చేసింది సోనీ లైవ్.


తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషలలో కూడా ఒకేసారి ఈ సినిమాని స్ట్రీమింగ్ కానుంది. ఆకట్టుకొని కంటెంట్తో ఉండడంతో గార్గి సినిమా తెలుగు లో SP ప్రొడక్షన్ బ్యానర్ పై రానా దగ్గుబాటి విడుదల చేయడం జరిగింది. సాయి పల్లవి సినిమాని థియేటర్లో చూడని వారు ఇప్పుడు ఓటీటి లో నేరుగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం సోనీ లైఫ్ పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: