ఒక స్టార్ కి కొడుకు ఉంటే ఆటోమేటిక్ గా అతడు కూడా హీరో అయిపోతాడు. చిన్నప్పటి నుంచే దానికి తగ్గట్లుగా ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. యంగేజ్ కి వచ్చిన తరువాత ఫిల్మ్ స్కూల్స్ కి పంపించడం, ప్రత్యేకంగా మాస్టర్స్ ను పెట్టి నటనతో పాటు డాన్స్ లు, ఫైట్స్ కి సంబంధించిన శిక్షణ ఇప్పిస్తుంటారు.


అయితే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మాత్రం తన కొడుకు దుల్కర్ సల్మాన్ ను సినిమాల్లోకి తీసుకురావాలని అనుకోలేదట.


కొడుకుని దుబాయ్ పంపించి అక్కడే ఉద్యోగం కూడా చేయించారట.. అయితే దుల్కర్ కి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నటుడిగా మారతానని చెబితే.. మమ్ముట్టి చాలా బాధపడ్డారట. నటించడానికి ఒప్పుకోలేదట. నాన్న ఒప్పుకోకపోవడానికి నేనే కారణమంటూ దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత అమెరికాలోని ఎంబీఏ చేశారు దుల్కర్. ఆ తరువాత దుబాయ్ లో ఉద్యోగం చేశారట. కానీ 9-5 ఉద్యోగం చేయడం తనకు బోర్ కొట్టడంతో అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనిపించి ఉద్యోగం మానేసి కేరళకు వచ్చేశారట.


 


ఉద్యోగం మానేసినందుకు, సినిమాల్లోకి వస్తానందుకు నాన్న చాలా బాధపడ్డారని దుల్కర్ గుర్తుచేసుకున్నారు. 'నీకేమైనా పిచ్చి పట్టిందా..? నువ్ నటించలేవు. నువ్ సరదాగా డాన్స్ చేయడం కూడా నేనెప్పుడూ అస్సలు చూడలేదు. వారసుడిగా నిన్ను పరిచయం చేయగలను కానీ నువ్ నటించకపోతే దారుణమైన విమర్శలు వస్తాయి. అవి విని నేను తట్టుకోలేను' అని మమ్ముట్టి అన్నారట. ఆయన అలా అనడానికి కారణముందని..


 


నటనను ఎప్పుడూ ఒక ఛాయిస్ లా అనుకోలేదని దుల్కర్ చెప్పుకొచ్చారు. స్కూల్ లో ఉన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని కానీ స్టేజ్ ఎక్కాలంటే వణికిపోయేవాడినని అన్నారట దుల్కర్. కల్చరల్ యాక్టివిటీస్ లో అసలు పాల్గొనేవాడిని కాదని.. అందుకే నాన్న సినిమాల్లోకి వద్దని చెప్పినట్లు వెల్లడించారు దుల్కర్. ఫైనల్ గా ముంబైలో యాక్టింగ్ కోర్స్ చేసి నాన్నను ఒప్పించి సినిమాల్లోకి వచ్చానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: