ఇండియాలొనే స్టార్ డైరెక్టర్ గా  డైరెక్టర్ రాజమౌళి సక్సెస్ ల వెనుక ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ పాత్ర చాలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాజమౌళి ప్రతి సినిమా కు కూడా విజయేంద్ర ప్రసాద్ కథలను అందించాడు.ఇకపోతే కేవలం జక్కన్న సినిమాలకు మాత్రమే కాకుండా బాలీవుడ్ తో పాటు ఇతర భాషల సినిమాలకు కూడా కథలను అందించి పాన్ ఇండియా రైటర్ గా పేరు దక్కించుకున్నాడు.అయితే రచయితలు దర్శకులుగా మారడం చాలా కామన్ విషయం.ఇక ఇండస్ట్రీలో త్రివిక్రమ్ మొదలుకుని కొరటాల శివ వరకు ఎంతో మంది రచయితలు దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు.

అంతేకాదు  కొందరు రెండు మూడు సినిమాలకే కనుమరుగు అయ్యారు.ఇకపోతే  విజయేంద్ర ప్రసాద్ కూడా దర్శకుడిగా సినిమా లు చేశాడు కాని సక్సెస్ కాలేక పోయాడు.కాగా విజయేంద్ర ప్రసాద్ రాజన్న మరియు శ్రీవల్లి సినిమాలను చేశాడు.ఇక  రాజన్న సినిమా కాస్త పర్వాలేదు అనిపించినా కూడా శ్రీవల్లి సినిమా ఇలా వచ్చి అలా వెళ్లి పోయింది.అయితే  కనీసం జనాల్లో ఆ సినిమా గురించి పెద్దగా చర్చ కూడా జరగలేదు. కాగా కమర్షియల్ గా ఇప్పటి వరకు సక్సెస్ కాలేక పోయిన విజయేంద్ర ప్రసాద్ మరో ప్రయత్నం చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే ఆ మధ్య దర్శకత్వం పై ఆసక్తి లేదంటూ చెప్పుకొచ్చిన విజయేంద్ర ప్రసాద్ మరో ప్రయత్నం కు సిద్ధం అవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇకపోతే ఇప్పటికే కథ ను రెడీ చేసుకున్న విజయేంద్ర ప్రసాద్ ఆ కథను ఇప్పటికే ఇద్దరు ముగ్గురు స్టార్స్ కు వినిపించాడట.ఇక  ఈసారి స్టార్ హీరోతో సినిమా చేయాలని విజయేంద్ర ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.కాగా రచయితగా సక్సెస్ అయిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు దర్శకుడిగా సక్సెస్ అవ్వలేక పోయాడు. అయితే అందుకే ఏ స్టార్ హీరో కూడా విజయేంద్ర ప్రసాద్ తో సినిమా ను చేసేందుకు సాహసించడం లేదు.పోతే దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఏ స్టార్ హీరో ముందుకు వస్తాడు అనేది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: