ఆయాన చేసే సినిమా ఫలితంతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. అయితే ప్రస్తుతం నాని మాస్‌ ఆడియెన్స్‌లో క్రేజ్‌ తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఇకపోతే ఇటీవలే ఈయన నటించిన 'అంటే సుందరానికీ' విడుదలై యావరేజ్‌గా నిలిచింది.అయితే నాని సినిమాలకు టాక్ బాగానే వస్తున్నా కమర్షియల్‌గా బ్లాక్‌ బస్టర్‌ విజయాలు సాధించలేక పోతున్నాయి.ఇదిలావుంటే ఇక  నిజానికి నాని నటించిన గత ఐదారు చిత్రాలు కూడా కలెక్షన్ల పరంగా యావరేజ్‌గానే మిగిలాయి.

ఇక ఈ క్రమంలో  ఊరమాస్‌ అవతారంలో నాని 'దసరా' చిత్రంతో గతంలో ఎన్నడు చేయలేని అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే  ఈ చిత్రంతో ఎలాగైనా మాస్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు నాని .ఇక శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే విడుదలైన నాని  పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌చేశాయి. తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కాగా నాని   దసరా చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌’

 పాటను అక్టోబర్‌ ౩న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇక నాని ఓ పోస్టర్‌ను కూడా చేశారు.కాగా ఈ పోస్టర్‌లో నాని ఊరమాస్‌ అవతారంలో కనిపిస్తున్నాడు.అయితే సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఊరమాస్‌ అవతారంలో నాని, కీర్తి డీ గ్లామర్‌ పాత్రల్లో కనిపించనున్నారు.ఇక ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఊరమాస్‌ అవతారంలో నాని తన రెమ్యునరేషన్‌ కూడా తగ్గించుకున్నాడని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమా నాన్‌-థియేట్రికల్‌ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: