మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన టాలీవుడ్ హీరో అడవి శేష్. ఈ సినిమాకు ముందు నుండి కూడా అడవి శేష్ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సక్సెస్ ను అందుకున్నాడు. అయితే ఇతని సినిమాలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడం, మరియు స్క్రీన్ ప్లే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే సక్సెస్ కు కారణాలు అని చెప్పవచ్చు. పైగా సినిమా కథల విషయంలో తాను కూడా సూచనలు ఇవ్వడం , తనను ఎలా చూస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అన్న విషయంలో కూడా తనకు డైరెక్టర్ దగ్గర ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అందుకే తన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవడం అంటూ జరగదు.

ఇదిలా ఉంటే రేపు అడవి శేష్ మరియు మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్ లుగా నటించగా , కొందరు మనకు నచ్చి నటీనటులు మిగిలిన పాత్రలలో నటించారు. హిట్ పార్ట్ 1 తో హిట్ కొట్టిన శైలేషు కొలను హిట్ ది సెకండ్ కేస్ పేరుతో సీక్వెల్ ను రేపు థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఒక్క అమ్మాయి మర్డర్ ను ఇన్వెస్టిగేట్ చేయడమే కథాంశం. దానిని ప్రేక్షకులకు నచ్చే విధంగా ఎలా మలిచారు అన్నది సినిమాకు ప్లస్ కానుంది. మాములుగా ఇదే కథాంశంపై చాలా సినిమాలు వచ్చినా స్క్రీన్ ప్లే టేకింగ్ బాగుంటే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

రేపు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండడంతో సినిమా వర్గాలు భారీగా అంచనాలు పెట్టుకున్నాయి. కొన్ని సార్లు అంచనాలు పెట్టుకోవడం కూడా సినిమా ఫలితం పై ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్ కార్యక్రమాలలో టోటల్ టీం చాలా నమ్మకంతో ఖచ్చితంగా మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది అంటూ చెప్పారు. అయితే ఈ అంచనాలు అన్నీ అడవి శేష్ అండ్ టీం అందుకుంటుందా ? లేదా అన్నది తెలియాలంటే రేపు మొదటి షో అయ్యే వరకు వేచి చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: