సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలతో పోలిస్తే స్టార్ హీరోయిన్ల కెరియర్ అంత లాంగ్ గా ఉండదు. దాదాపు స్టార్ హీరోయిన్లు కూడా కొన్ని సంవత్సరాల వరకే స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వారు కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో మరికొన్ని పాత్రలకు పరిమితం అవుతూ ఉంటారు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు , తమిళ్ ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆ ముద్దుగుమ్మ నాకు స్టార్ హీరోల సినిమాలలో , అలాగే  పెద్ద పెద్ద బ్యానర్లలో అవకాశాలు రావడం లేదు అని కామెంట్స్ చేసింది. అంత క్రేజ్ కలిగిన నటి అలా కామెంట్స్ చేయడంతో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకు అంతలా షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ స్టార్ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి సిమ్రాన్. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలతో నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈమె తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కేరిర్ను కొనసాగించింది. 

ఈ మధ్య కాలంలో ఈమె స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా అవకాశాలను అందించుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయింది. తాజాగా ఈ నటి టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె మాట్లాడుతూ ... నాకు చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమా అవకాశాలు రావడం లేదు అని కామెంట్ చేసింది. తాజాగా సిమ్రాన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: