దశాబ్ద కాలానికి పైగా జరుగుతున్న ఎడతెగని ప్రయత్నాలు ఓ కొలిక్కి వ‌చ్చాయి. ఈ ఏడాది మే నెలలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వార్తా సంస్థ ది వైర్ దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించి ఎట్టకేలకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల వివరాలను bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది.  భారీ బకాయిల సమాచారాన్ని భద్రపరిచే కేంద్రీకృత బ్యాంకింగ్ వ్యవస్థ డేటాబేస్ సీఆర్‌ఐఎల్‌సీ సాయంతో వెల్లడించింది. . 30 భారీ ఉద్దేశపూర్వక రుణ ఎగవేత సంస్థల పేర్లను బ‌హిర్గ‌తం చేసింది. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల తాజా జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సంస్థలూ ఉన్నాయి. ఓ ప‌త్రిక యాజ‌మాన్యం సైతం ఇందులో ఉంది. 

 

ఆర్బీఐ విడుద‌ల చేసిన జాబితాలో...ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన మూడు సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్, కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ పేర్లున్నాయి. దక్కన్ క్రానికల్ బకాయిల ఎగవేత రూ.1,951 కోట్లుగా ఉండ గా, వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1,314 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాటా రూ.984 కోట్లుగా ఉన్నది. వీటిలో ఆంగ్ల, తెలుగు దినపత్రికలను ప్రచురిస్తున్న దక్కన్ క్రానికల్.. దివాలా ప్రక్రియకు వెళ్లిన విషయం తెలిసిందే.

 

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న‌ మీడియా గ్రూ ప్ దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లతోపాటు మిగ‌తా వారి వివ‌రాల విష‌యానికి వ‌స్తే.... విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, పీఎన్‌బీ మోసగాడు మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, పరారీ ఆర్థిక నేరగాడు జతిన్ మెహెతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యుయెల్లరీ లిమిటెడ్, విక్రమ్ కొఠారీకి చెందిన పెన్నుల తయారీ సంస్థ రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్‌ఈఐ అగ్రో లిమిటెడ్, ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ తదితర సంస్థలున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: