చంద్రబాబు ఎప్పుడైతే అమరావతి ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారో అప్పటినుండి రాజధాని పై కుల ముద్ర పడిపోయింది. చంద్రబాబు తమ సామాజిక వర్గానికి చెందిన వారికి మేలు చేయాలని అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టారని విమర్శలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఏమాత్రం రాజధానికి వీలులేని ఆ ప్రాంతంలో ఎక్కువగా చంద్రబాబు వర్గీయులు ఉండటం వల్ల అమరావతి ని చంద్రబాబు రాజధానిగా గుర్తించడం జరిగిందని చంద్రబాబు వ్యతిరేకించే వైసిపి పార్టీ మిగతా కొన్ని పార్టీలు ఎప్పటినుండో వ్యతిరేకించాయి. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రాజధాని వికేంద్రీకరణ చేస్తూ విశాఖపట్టణానికి మరియు కర్నూలు కి కూడా విస్తరించడం జరిగింది. 
IHG
అయితే అమరావతి ని మాత్రమే ఏకైక రాజధానిగా గుర్తించాలని భూములు ఇచ్చిన రైతులు దాదాపు 200 రోజులకు పైగానే దీక్షలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ తరుణంలో అమరావతి పై కుల ముద్ర వేయాలని చూస్తున్న వారికి అమరావతి ని సపోర్ట్ చేసే వాళ్ళు సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ పెట్టారు. అదేమిటంటే ఏ సామాజిక వర్గం అమరావతి కోసం ఎంత భూమి త్యాగం చేసింది..? వంటి విషయాల గురించి పూర్తిగా అన్ని లెక్కలు బయట పెట్టారు. 
IHG
ఈ క్రమంలో ‘అధికార పార్టీ చెప్పిన లెక్క తప్పు.. కమ్మ సామాజిక వర్గం ఇచ్చిన భూమి ఇంత.. కాపు సామాజిక వర్గం ఇచ్చిన భూమి ఇంత.. దళితుల భూముల లెక్కలు ఇంత.. బీసీల భూముల లెక్కలు ఇంత..’ అంటూ లెక్కలు చూపిస్తూ, ‘ఇప్పుడేమంటావ్‌.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. మరోపక్క గవర్నర్ ఆమోదముద్ర పొందితే వెంటనే రాజధానిని విస్తరించడానికి జగన్ సర్కార్ కాచుకుని కూర్చుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: