ఆంధ్ర ప్రదేశ్ లో  బ‌ద్వేల్ ఉప ఎన్నికల  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  ఈ ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా సాగినట్లుగా క్లారిటీ వ‌చ్చేసింది. ఇక్క‌డ గెలుపు అయితే అధికార వైసీపీ దే . అయితే ఇక్క‌డ ఆ పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాసరి వెంక‌ట సుధ ఎంత మెజార్టీతో గెలుస్తారు అనే దానిమీదే లెక్క‌లు వేసుకోవాల్సి ఉంది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీ సంప్రదాయం పేరుతో ఈ ఉప ఎన్నిక‌కు దూర‌మైంది. ఇక మ‌రో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన జనసేన కూడా టీడీపీ బాటలో నడిచి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. అయితే జాతీయ పార్టీలు అయిన బీజేపీ తో పాటు కాంగ్రెస్ మాత్రం ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశాయి.

ఆ రెండు పార్టీల‌కు ఇక్క‌డ గెలిచే స్కోప్ అయితే లేదు.. అయితే ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌న్న లెక్క‌ల కోస‌మే వీరు పోటీ చేసిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అయితే బ‌ద్వేల్లో పోలింగ్ జ‌రుగుతోన్న వేళ జ‌రిగిన విచిత్రం ఏంటంటే నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థికి దన్నుగా పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ వాళ్లు అండ‌గా నిలవటం. ఉప ఎన్నికల్లో నాన్ లోకల్ అయిన పణతల సురేష్ ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయ‌న రైల్వే కోడూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన కోడూరు లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ సారి మాజీ మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆయ‌న్ను ఇక్క‌డ పోటీ చేయించారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేశ్ కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా.. టీడీపీ నేతలతో బీజేపీ వాళ్లు ఒప్పందాలు కుదుర్చు కున్నార‌ట‌. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ది బూతుల లోనే బీజేపీకి ఏజెంట్లు ఉంటే .. మిగిలిన అన్ని బూత్ ల‌లోనూ టీడీపీ వాళ్లే ఏజెంట్లుగా ఉన్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: