
ఒక పక్క పక్క రాష్ట్రం టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు హాజరు కాకపోవడం పట్ల ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎంపీలు కొన్ని కొన్ని విషయాల్లో వెనక్కు తగ్గడం కూడా జగన్ లో అసంతృప్తి పెరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎంపీలకు జగన్ ఎన్నో సలహాలు ఇవ్వడమే కాకుండా రోజు వారితో ఫోన్లో కూడా మాట్లాడుతున్నారు.
ప్రధానంగా రాయలసీమ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో కనీసం తమ సమస్యలు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అసంతృప్తి జగన్ లో ఉందని అంటున్నారు. నియోజక వర్గాల్లో భారీ వరదలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి సరే కనీసం వారి దృష్టికి కూడా వైసీపీ ఎంపీలు తీసుకు వెళ్లలేక పోతున్నారని దీనితో కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నాయి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాని ఎంపీల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయంగా కూడా ఇది ఇబ్బందికర పరిస్థితిని కాబట్టి ఎంపీలు అర్థం చేసుకుని ముందుకు వెళ్లలేక పోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.