అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో మొదలైన పాదయాత్ర మిడిల్ డ్రాపైనట్లేనా ? ఎందుకంటే అమరావతి డిమాండును వినిపించేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ ను వేదికగా చేసుకోవాలని అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో జంతర్ మంతర్ వేదికగా అమరావతి అవసరాన్ని పార్లమెంటుకు వినిపించాలని నేతలు డిసైడ్ అయ్యారు. హైకోర్టు అనుమతించిన తర్వాత కూడా పాదయాత్రను వదిలేసి ఢిల్లీలో నిరసనలు, ఆందోళనలు అంటున్నారు కాబట్టే పాదయాత్ర మిడిల్ డ్రాప్ అయినట్లే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. టీడీపీ కానీ ఎల్లోమీడియా కానీ ఇపుడు పాదయాత్ర గురించి పెద్దగా పట్టించుకోవటంలేదు. 


అమరావతి టు అరసవల్లికి మొదలుపెట్టిన  పాదయాత్రను నిర్వాహకులు తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఆపేశారు. కారణం ఏమిటంటే పాదయాత్రలో పాల్గొనే వారి గుర్తింపుకార్డులను పోలీసులు తనిఖీచేశారు. ఆ తనిఖీల్లో 60 మంది దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరా గుర్తింపుకార్డులు లేవు. పోలీసులు పట్టుకుంటారేమో అనే భయంతో పాదయాత్రలో పాల్గొంటున్న వారిలో అత్యధికులు పారిపోయారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక నిర్వాహకులు పాదయాత్రకు బ్రేకిచ్చారు.

పాదయాత్రకు పోలీసులు విధించిన షరతులను ఎత్తేయాలని నిర్వాహకులు వేసిన కేసును కోర్టు కొట్టేసింది. పాదయాత్ర సందర్భంగా నిర్వాహకులు షరతులను పాటించాల్సిందే అని తేల్చిచెప్పింది. దాంతో పాదయాత్ర కంటిన్యు చేయటం కష్టమని నిర్వాహకులకు అర్ధమైపోయింది. ఎందుకంటే అప్పటివరకు ఆందోళనల్లో, పాదయాత్రలో పాల్గొన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, టీడీపీ నేతలు, కార్యకర్తలే అన్న వైసీపీ నేతల ఆరోపణలు నిజమేనని బయటపడింది.

పాదయాత్రలో పాల్గొనేందుకు గుర్తింపుకార్డులున్న 600 మంది దొరకకపోవటమే విచిత్రంగా ఉంది. దీంతోనే అమరావతి సెంటిమెంటు ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిపోయింది. అందుకనే ఆ ప్రయత్నాన్ని మానుకుని ఢిల్లీలో నిరసనలంటు కొత్త రాగం మొదలుపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకరైలును వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరీ ప్రయత్నంలో అయినా జేఏసీ నిర్వాహకులు సక్సెస్ అవుతారా ? లేకపోతే పాదయాత్రలాగే మళ్ళీ ఇందులో కూడా ఫెయిలవుతారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: