
అయితే వైసీపీ నుండి పోటీ చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓటమి చెందక తప్పలేదు. అప్పటి నుండి అబ్దుల్ అజీజ్ పార్టీలో మరింత యాక్టీవ్ గా ఉంటూ నెల్లూరు రూరల్ మరియు సిటీ లలో ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. అంతే కాకుండా 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారిలో అబ్దుల్ అజీజ్ ఉన్నారు. కానీ ఈసారి చంద్రబాబు అజీజ్ కు టికెట్ ఇస్తారన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఆ టికెట్ ను ఆశిస్తున్న వారిలో ఇద్దరు రాజకీయంగా అనుభవం ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి మరియు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లు 2024 ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేయడానికి చూస్తున్నారు.
ప్రస్తుతం ఇద్దరూ కూడా వైసీపీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే చంద్రబాబు అధికారికంగా వీరిద్దరిలో ఒకరికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ నెల్లూరు రూరల్ టికెట్ దక్కే ఛాన్స్ లేదు. అ విధంగా గత ఎన్నికల్లో చాన్సు ను దక్కించుకున్న అబ్దుల్ అజీజ్ కు వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదు.