చిత్తూరు జిల్లాలో రెండుచోట్ల బంగారం వెలికితీతకు నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండిసి) సిద్ధమైంది. జిల్లాలోని చిగరికుంట, బిసానత్తం గ్రామాల పరిధిలో త్వరలోనే తవ్వకాలు జరపనున్నారు. ఒకటీ రెండు నెలల్లో ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎపిఎండిసికి సమాచారం అందింది. గతంలో కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ఈ బంగారు గనులను అనంతరం ఎపిఎండిసికి కేటాయించారు.

 

వెలికితీత కష్టంగా ఉండటంతో గనులను ఎపిఎండిసి వేలం పెట్టింది. దీనిలో వేదాంత, ఆదానీ లాంటి కంపెనీలను వెనక్కు నెట్టి ఎన్‌ఎండిసి పాడుకుంది. ఏడాది క్రితమే ఈ ఒప్పంద ప్రక్రియ లోతుకు వెళ్లి దీన్ని వెలికితీయాల్సి ఉంటుందని వివరించారు. గనిలో పనిచేసేవారికి నిరంతరం ఆక్సిజన్‌ సరఫరాకు అవసరయ్యే ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. బిసానత్తం, చిగురుకుంట బంగారు గని ప్రాంతం సుమారు 263 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.

 

ఇక్కడ క్వార్ట్జ్‌ 1.83 మిలియన్‌ టన్నులు ఉంటుందని అంచనా వేశారు. ఒక టన్ను క్వార్ట్జ్‌ను వెలికి తీస్తే ప్రాసెసింగ్‌ అనంతరం 5.15 కిలోల బంగారం వస్తుందని ఖజానాభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. గని మొత్తాన్ని వినియోగిస్తే సుమారు 8.5 టన్నుల బంగారం వస్తుందని త్వరలోనే ఎన్‌ఎండిసి వెలికితీత ప్రక్రియను ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ గనిద్వారా సుమారు రూ.900 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని వివరించారు.

 

గతంలో అనంతపురం పరిధిలో ఉన్న గనుల్లో వెలికితీతకు సిద్ధమైన నేపథ్యంలో నష్టదాయకమని గతంలో అంచనా వేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో గనులు లాభదాయకంగా ఉన్నాయని, వెలికితీత కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదని తెలిపారు. అయితే అనంతపురంలో ఉన్న బంగారు వెలికితీతను తక్కువలో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: