అంతులేని అబద్ధాలకు అవంతీ శ్రీనివాస్‌ మారుపేరుగా నిలిచారు. మునిగిన పడవను 38 రోజులపాటు తీయలేనందుకు సిగ్గుపడాల్సిందిపోయి గొప్పలు చెప్పుకుంటారా..? అని మంతెన సత్యన్నారాయణ పేర్కొన్నారు.   5 నెలల్లో సంక్షేమ రంగంపై ఒక్క నయాపైస కూడా ఖర్చు చేయకుండా రాష్ట్రంలో సమస్యలే లేవని అవంతి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఇంటికో సమస్య, వీధికో దౌర్జన్యం, గ్రామానికో అరాచకం చూపిస్తే.. మీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని ప్రశ్నించారు.   2019 అవంతీ శ్రీనివాస్‌కు పతననామ సంవత్సరంగా మిగిలిపోయింది. మంత్రికి ఎక్కువ.. వార్డుమెంబర్‌కు తక్కువగా అవంతి వ్యవహరిస్తున్నారు. శకుని మామలా వ్యవస్థలను అస్తవ్యస్థం చేస్తున్నారని విమర్శించారు.  

అసమర్థులు అందలం ఎక్కితే భవిష్యత్తు అంధకారం అవుతుందనడానికి మీరే ఒక చక్కని ఉదాహరణ. కూల్చివేతలు, అరెస్ట్‌లు, ఆందోళనలు, రంగులు వేయడాలు మీ అసమర్థ పాలనకు సజీవ సాక్ష్యాలు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసి దీపావళి రోజున వారి జీవితాలలో చీకట్లు నింపారు. ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాలతో కార్మి, కర్షక రంగాలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. అందుకు దారితీసిన పరిస్థితులు, పరిణామక్రమాలపై దృష్టి పెట్టకుండా అంతా బాగానే ఉందని మీరు చెప్పడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటె, నిన్నటి రోజున విశాఖలో ఇసుక గురించి జనసేన కార్యకర్తలు అవంతి ఇంటిని ముట్టడించారు.  అవంతి ఇంటిని ముట్టడించడంతో.. ఇసుక ఇబ్బందుల నుంచి త్వరలోనే బయటపడతారని,  అన్ని సర్దుకుంటాయని చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు.  అయితే, ఇసుక కొరత వైకాపాను ఇబ్బంది పెడుతున్నది అనే విషయం అందరికి తెలిసిందే.  ఇసుక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మరి వైకాపా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.  ఇక తెలుగుదేశం పార్టీ ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నది. ఈ ఆందోళనకు వైకాపా భయపడిందని, భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేస్తామని టీడీపీ అంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: