వైఎస్ జగన్ మరోమాట నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మొదటి విడతగా.. రూ. 10 వేల రూపాయలలోపు డిపాజిట్ ఉన్నవారికి వారి అకౌంట్లలో నగదు జమ చేశారు. ఇందుకోసం దాదాపు 265 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అంతేకాదు.. త్వరలోనే రూ. 20 వేల రూపాయల డిపాజిట్ దారులకు కూడా న్యాయం చేస్తామన్నారు.


అంతే కాదు.. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నా వారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. వాస్తవానికి ఆర్థికంగా మోసపోయిన వారికి ప్రభుత్వం ఆ సొమ్ము చెల్లించడం బహుశా దేశంలోనే ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. అలాంటి ఘనతను తన ఖాతాలా వేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అని అధినేత చంద్రబాబు అంటున్నారు.


అగ్రిగోల్డ్ విషయంలో నిందితులపై కేసులు పెట్టి జైలుకు పంపి, అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వమేని చంద్రబాబు అంటున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల చొప్పున 100 కుటుంబాలకు 5 కోట్లు అందించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.


బాధితుల జాబితా సేకరించి తొలి విడత పంపిణీకి 336 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధం చేసిందని, ఆ మొత్తాన్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 264 కోట్లకు తగ్గించిందని చంద్రబాబు మండిపడ్డారు. 1150 కోట్లు బడ్జెట్ లో పెట్టి నిధులు ఎందుకు విడుదల చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ దోచేసిందన్న వైసీపీ ఆరోపణలు ఏమయ్యాయని చంద్రబాబు అడిగారు. అగ్రిగోల్డ్ పై అసత్య ప్రచారం చేసి బాధితులను మనోవేదనకు గురిచేసిన వైసీపీ నేతలు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా వాదిస్తున్న చంద్రబాబు తీరు చూసి ఆంధ్రప్రజ నవ్వుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: