ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లి సమావేశం కొనసాగుతోంది. శాసనసభ వద్ద గురువారంనాడు మార్షల్స్‌ వ్యవహరించిన తీరుపై సభలో ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. మార్షల్స్‌తో చంద్రబాబు అమానుషంగా ప్రవర్తించారని సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగిని బాస్టర్డ్ అని దూషించారని మండిపడ్డారు. మార్షల్స్‌పై దాడి చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని మంత్రులు బుగ్గన, కన్నబాబు డిమాండ్ చేశారు. 

 

చంద్రబాబు అనని మాటను అన్నారని అధికారపక్షం అసత్య ఆరోపణలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అసెంబ్లీ గేటు బయట జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను సభలో ప్రదర్శించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ఇతర నేతలను లోపలకు రానివ్వకుండా గేటు దగ్గర మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్‌పై చంద్రబాబు, లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మార్షల్స్‌ను చంద్రబాబు అసభ్య పదజాలంతో దూషించారు. గేటును బలవంతంగా నెట్టుకుంటూ చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలు లోపలకు దూసుకొచ్చారు. ప్రతిపక్ష నేతనే అడ్డుకుంటారా అని టీడీపీ నాయకులు మార్షల్స్‌ను బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అంతేకాక ఆయ‌న నీకు బుర్ర ఉందా. బాస్ట‌ర్డ్ అన్న అస‌భ్య‌ప‌ద‌జాలం కూడా వాడారు. 

 

ఇక ఇదిలా ఉంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను సభలోకి ప్రవేశించాల్సిన గేటు అసలు అది కాదని. ఆయన గేటు నెంబర్‌ 2 నుంచి సభలోకి రావాల్సి ఉందని. కానీ అందరితో కలిసి ఆందోళన చేయాలని చంద్రబాబు చూశారు. ప్రోటోకాల్‌ ప్రకారం సభ్యులను మాత్రమే లోనికి పంపేందుకు మార్షల్స్‌ ప్రయత్నించడం. చంద్రబాబు నోటి నుండి బాస్టర్డ్‌ అనే మాటొచ్చిందన్నారు. సభ్యులు కాని వారిని మార్షల్స్‌‌ అడ్డుకునే ప్రయత్నం చేశారని లోకేష్‌ మార్షల్స్‌ గొంతుపట్టుకొని యూస్‌లెస్‌ ఫెలో అన్నారని జగన్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఓ గ‌వ‌ర్న‌మెంటు ఉద్యోగిని అలా దుర్భాష‌లాడ‌టం పై వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: