సీఎం జగన్ పై ఆయన మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ మాటపై నిలబడే వ్యక్తి అని మెచ్చుకున్నారు. పాత విషయాలు గుర్తు చేసుకున్నారు. ఆయన ఏమన్నారంటే..

 

 

 

 " 2015లో తిరుపతిలో మా యూనియన్ మీటింగ్‌లో ఆర్టీసీపైన, ఆర్టీసీకున్న నష్టాలు, దాన్ని గట్టెక్కించే మార్గాలు, కార్మికులకు భరోసా కల్పించడం ప్రజలకు మంచి రవాణా వ్యవస్థ ఉండాలనే ఉద్దేశ్యంతో జగన్ గారు కార్మికులందరికీ మాటిచ్చారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని అప్పుడున్న తెలుగుదేశాన్ని డిమాండ్ చేద్దామన్నారు. వాళ్లు చేయకపోతే మన ప్రభుత్వం రాగానే చేద్దామన్నారు. 

 

 

 

మాటపై నిలబడే వ్యక్తి కనుక జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు హితకరమైన బిల్లు ఇది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికే ఈ బిల్లు ప్రవేశ పెట్టారు. ఆర్టీసీకి చాలా నష్టాలు, కష్టాలున్నాయి. టీడీపీ హయాంలో కార్మికులకు సంబంధించి వారి పీఎఫ్ డబ్బును కూడా వాడేసే స్థాయికి ఆర్టీసీ దిగజారిపోయింది. వారి కొఆపరేటివ్ సొసైటీలోని డబ్బులు, ఉద్యోగస్తుల అరియర్స్ డబ్బును కూడా వాడేసిన పరిస్థితి. ఇవన్నీ కలిపితే ఆర్టీసీ 6934కోట్ల నష్టాలకు చేరింది. 

 

 

ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు ఉద్యోగ భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. ఆర్టీసీ ఉంటుందో లేదో అనే స్థితి, బ్యాంకుల్లో ఎంపీ అయిపోయే పరిస్థితి, కొద్ది రోజులకు బ్యాంకులు ఆక్షన్ కు వచ్చే స్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితిలో సీఎం జగన్ గారు కార్మికులకు ఓ భరోసా కల్పించేందుకు ఈ బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు.

 

 

 ఆర్టీసీ ప్రైవేటేజషన్ దిశలో చాలా రాష్ట్రాలు నడుస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఓ చరిత్ర. కార్మికుల దృష్టిలో, ప్రజల దృష్టిలో ఓ కల. గట్స్ ఉన్న నాయకులు మాత్రమే తీసుకోగల నిర్ణయమిది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మన ముఖ్యమంత్రిని ఖచ్చితంగా శ్లాఘించాలి అంటూ అల్లుడిని తెగ మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: