సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మంత్రి జగదీష్ రెడ్డి  తన మార్కు చూపించాడు. లక్షలు, కోట్లు దారపొసే సత్తా ఉన్న నాయకులను పక్కకు పెట్టి జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్ పర్సన్ పీఠంపై కూర్చోబెట్టారు .  ఎన్నికల ఫలితాలు ముగిసిన్నప్పటి నుండి చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకునేందుకు  ఆశావాహులు అన్ని  రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవన్నీ సావధానంగా వింటూనే  తన నిర్ణయాన్ని అత్యంత రహస్యంగా ఉంచిన మంత్రి , చివరకు  చైర్ పర్సన్ అభ్యర్థిని అన్నపూర్ణ ను   ప్రకటించారు.

 

చైర్ పర్సన్ గా తన  ఎన్నిక విషయం  తెలియక పోవడంతో కౌన్సెలర్ అయితే చాలు అనుకున్న   అన్నపూర్ణ ఏకంగా చైర్ పర్సన్ అయింది . చైర్ పర్సన్ ఎన్నికైన అన్నపూర్ణ ఆనందంతో కన్నీరు కారుస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది.  అన్నపూర్ణ మొదటి నుండి జగదీష్ రెడ్డి  వెంట ఉండి నేటి వరకు ఆయన అనుచరురాలిగానే  కొనసాగుతున్నారు . ఈ ఒక్క నిర్ణయం తో  మంత్రి   సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధిలో  తీర్చి దిద్దటం తో పాటు రాజకీయ ధనస్వామ్యాన్ని  ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్నారని స్పష్టం అవుతుందని టీఆరెస్ నేతలు అంటున్నారు .  

 

దళిత మహిళను  సూర్యాపేట మున్సిపల్  చైర్మన్ పీఠం పై కూర్చోబెట్టడం పట్ల  ప్రజలు కూడా  జగదీష్ రెడ్డిని  అభినందిస్తున్నారు. రాజకీయాల్లో జనరల్ స్థానాల్లో ఇతర సామాజిక  వర్గాలకు బహు అరుదుగా పార్టీ అమాత్యులు అవకాశం కల్పిస్తుంటారు . జనరల్ స్థానాలను అగ్ర వర్గాలకు చెందిన వారే ఎక్కువ ఆశించడం , వారిని అమాత్యులు కూడా కాదనలేకపోవడం జరుగుతుంటుంది . కానీ సూర్యాపేట వంటి పెద్ద మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎంపిక లో మాత్రం జగదీష్ రెడ్డి తనదైన మార్క్ ప్రదర్శించి అందరి చేత అభినందనలు అందుకుంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: