ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ రద్దు బిల్లు ఆగమేఘాలపై కదులుతున్నది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం పొందిన వెంటనే శాసనసభ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. అక్కడ నుంచి కేంద్ర హోం శాఖకు కౌన్సిల్ రద్దు తీర్మానం చేరింది. తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం కేంద్ర హోం శాఖ కార్యాలయం లో కౌన్సిల్ రద్దుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర న్యాయ శాఖ పరిశీలనకు ఫైల్ వెళ్లింది.

కేంద్ర న్యాయ శాఖ ఒకటి రెండు రోజుల్లో పరిశీలన జరిపిన తర్వాత తన అభిప్రాయం చెబుతుంది. మండలిలో రెండు బిల్లులు వెనక్కు తిప్పి పంపడాన్ని సీరియస్సుగా తీసుకుంన్న ప్రభుత్వం మండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ రెండు రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

మండలిలో బిల్లులను ఆమోదింప చేసుకునేందుకు ప్రతిపక్షంతో జరిపిన సంప్రదింపుల్లో మండలి రద్దు అంశం ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నారు. అసెంబ్లీలో భారీ బలం వున్నా మండలిలో సంఖ్యా బలం లేకపోవడంతో సర్కారుకు తలనొప్పిగా మారిందని అందుకే ఆర్థికంగా భారమనే రీతిలో సర్కార్ నెపం మోపి దానిని రద్దు చేయచ్చంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయాన్ని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత కేంద్ర హోం శాఖ కేంద్ర మంత్రి మండలిలో టేబుల్ ఐటంగా ఈ అంశాన్ని ప్రవేశపెడుతుంది. కేంద్ర మంత్రి వర్గం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ రద్దు ప్రతిపాదనలపై ఎలాంటి చర్చ జరిపే అవకాశం లేదు. కౌన్సిల్ రద్దు వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర క్యాబినెట్ చర్చించి చేయగలిగింది ఏమీ లేదు.

అందువల్ల కేంద్ర క్యాబినెట్ టేబుల్ ఐటమ్ గా దాన్ని ఆమోదించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు పంపుతుంది. అక్కడ నుంచి లోక్ సభకు, రాజ్యసభకు చేరుతుంది. అసెంబ్లీలో భారీ బలం వున్నా మండలిలో సంఖ్యా బలం లేకపోవడంతో సర్కారుకు తలనొప్పిగా మారిందని అందుకే ఆర్థికంగా భారమనే రీతిలో సర్కార్ నెపం మోపి దానిని రద్దు చేయచ్చంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: