నాయకుడు అనే వాడు నలుగురికి ఆదర్శంగా ఉండాలని పెద్దలు అంటారు. కానీ నేటి నాయకులు అవినీతిలో ఆదర్శంగా నిలుస్తున్నారే గాని,  నలుగురు మెచ్చే విధంగా  మాత్రం కాదన్న విషయం అందరికి తెలిసిందే.. ఇకపోతే రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత, తెలంగాణాలో రాజకీయ శత్రుత్వాన్ని కేసీయార్ పూర్తిగా అణగతొక్కారని చెప్పవచ్చు..  

 

 

కానీ ఏపీలో రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ఇందుకు అనుగుణంగా ఏపీ రాజకీయాల్లో ఉన్న నాయకుల నుండి ఎవరో ఒకరు ఏదో ఒక వివాదస్పద వార్తలను మోస్తూనే ఉన్నారు.. కొన్ని కొన్ని సార్లు ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా దూషించు కుంటున్నారు.. గల్లీ లీడర్ల నుండి, ఢిల్లీ వరకు రాజకీయాలు చేసే నాయకులు దాదాపుగా అందరు ఇలానే ఉన్నారు..

 

 

ఇదిలా ఉండగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దాలు అసలు ఆగడం లేదు.. తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కూడా తన అక్కసును వెళ్లబోసుకున్నాడు.. అదెలా అంటే ఎన్నికల సమయంలో, ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని వైసీపీ నేతలు చెప్పారని, ఇప్పటి వరకు ఆ విషయమే ఎక్కడ ఎత్తడం లేదని, అదీ కాకుండా, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఎలా తెస్తారో వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న రాజకీయాల వల్ల ఏపీ అన్యాయమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

ఇకపోతే వైజాగ్‌కు రైల్వే జోన్‌ ఇచ్చామన్నారని, కానీ ఆదాయం వచ్చే ప్రాంతం మాత్రం ఆ జోన్‌ పరిధిలో లేదని విమర్శించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు కెటాయించిన బడ్జెట్‌ ఇదీ అని తెలపడానికి ఏం మిగలలేదని, అంతే కాకుండా ఆరేళ్లలో విభజన హామీలు 10 శాతం కూడా నెరవేర్చలేదు సరికదా, పోలవరాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యతను కూడా విస్మరించారని అందుకే ఈ విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని రామ్మోహన్‌నాయుడు కోరారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: