అన్ని పండుగలలో శివరాత్రి పండుగ అంటే హిందువులకు ఎంతో ఇష్టం. పంచాక్షరిలో శివ అనే రెండక్షరాలు చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. శివ అంటే మంగళ కరమని, శివస్వరూపం అత్యంత మంగళకరమైనదని పండితులు చెబుతున్నారు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో ప్రస్తావించిన మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. శివరాత్రి, పక్ష శివరాత్రి, మాసశివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి మొత్తం కలిపి ఐదు శివరాత్రిలు ఉండగా వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి గా పరిగణిస్తారు.




ఈ పర్వదినాన శివుడిని లింగ రూపంలో ఎవరు పూజిస్తే వారు పురుషోత్తములవుతారని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజు శివుడిని ఎవరైనా పూజిస్తే వారిని తన కుమారుడైన కుమారస్వామి కన్న ఇష్టంగా చూసుకుంటానని సాక్షాత్తు ఆ శివుడు చెప్పాడు. మహా శివరాత్రి ముందు రోజు అంటే త్రయోదశినాడు చతుర్దశి రోజున ఉపవాసం ఉండాలి. పరమశివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మీరు ఎటువంటి కోరికలు కోరుకున్నా అవి ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతాయి. పరమ శివుడు తన మూడవ కన్ను తెరిస్తే మంటలతో ప్రపంచమంతా వినాశనం అవుతుందని పురాణాలు చెబుతాయి.



తీవ్రమైన ఆగ్రహం వస్తే తప్ప పరమశివుడు తన మూడవ కన్ను తెరవడు. పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ప్రాముఖ్యం కలిగిన స్వరూపం. లింగోద్భవం జరిగింది అర్ధరాత్రి 12 గంటలకు అని మన పురాణాలు అంటున్నాయి. ఋగ్వేదం ప్రకారం స్త్రీ పురుష బేధం లేకుండా భక్తులందరు ఉపవాసం ఉండి జాగారం చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. శివరాత్రి రోజు ఆరు ప్రత్యేకమైన శివగంగ పూజిస్తే ఎక్కువ ఫలితాలు లభించే అవకాశం ఉంది. అలాగే శివలింగాన్ని అనేక రూపాలలో అలంకరిస్తారు. ఒకటవ రూపంలో అగ్నిలో కాలిపోయిన శుద్ధమైన విబూధి పరమేశ్వరుని అలంకరించడం మంచిది. పెద్దలు విబూధి అంటే ఐశ్వర్యం గా భావిస్తారు. ఇంకోటి రుద్రాక్ష అంటే శివుడి మూడవ కన్ను. దేవ దేవతలందరిలో తల భాగంలో కన్ను గలవాడు ఒక్కడు మాత్రమే శివుడు. మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రపదేశం లేని వారు శివనామం జపిస్తే సరిపోతుంది. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. 

మరింత సమాచారం తెలుసుకోండి: