టీడీపీ నాయకులు, ప్రజలు, రాజకీయ ప్రత్యర్దులు ఇలా అందరూ ముందు నుంచి ఊహించినట్టుగానే టీడీపీలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు తరువాత టీడీపీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరు అనేది సందేహంగా మారడంతో బాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ను రంగంలోకి దించాలని బాబు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు రాజకీయంగా మంచి మైలేజ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నా లోకేష్ మాత్రం ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నారు. అంతే కాకుండా లోకేష్ నాయకత్వ పటిమపై చంద్రబాబు తో పాటు పార్టీ నాయకులు ఎవరికీ నమ్మకం లేకపోవడంతో ఏడు పదుల వయస్సులోనూ చంద్రబాబు తీవ్రంగా ప్రజా పోరాటాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్నాడు.

IHG


 ఇక లోకేష్ మీద పెద్దగా ఎవరికీ నమ్మకంలేకపోవడంతో ప్రత్యామ్న్యాయంగా బ్రాహ్మణిని రంగంలోకి దించాలని బాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. నారా బ్రహ్మణికి ప్రత్యక్షంగా రాజకీయాలలో అనుభవం లేకపోయినా చంద్రబాబు కుటుంబ వ్యాపారాలను ఆమె లీడ్ చేస్తూ సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఆమె తన సత్తా చాటుతున్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆమె కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నారా బ్రాహ్మణిని టీడీపీలో యాక్టివ్ చేసేందుకు బాబు సిద్ధం అయ్యారు. ఇక టీడీపీ బరువు బాధ్యతలు మొత్తం ఆమె మోసేందుకు సిద్ధం అవుతున్నారు. అంతే కాదు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, పార్టీ కార్యకర్తలతో సభలు, సమావేశాలు ఇలా అనేకం నిర్వహించి ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు సమాచారం.

IHG


 చంద్రబాబు రాజకీయ వారసురాలిగా బ్రాహ్మణి రంగంలోకి దిగి పార్టీని ముందుకు నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆమెకు పార్టీ సీనియర్ నాయకులతో రాజకీయ పాఠాలు చెప్పిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వివరాలు ఎక్కడా బయటకి రాకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే ఆమె రాజకీయంగా ఎంతవరకు సక్సెస్ అవుతుతారు ..? చంద్రబాబు, పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: