గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం నడుస్తోంది. దీని వల్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకింత అసహనంగా ఉన్న సంగతి. అటు తెలంగాణాలో, ఇటు ఏ.పి లోనూ టీడీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే తెలంగాణా లో పార్టీ నేతలు పార్టీ కార్య కలాపాల్లో కొంచెం స్తబ్దుగా ఉన్నారు. దీని గురించి బాబు టీడీపీ సీనియర్ నేతలు, స్థానిక నాయకులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఆయన నేతల తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రం లో పార్టీ కార్య కలాపాలు అనుకున్నా విధంగా లేకపోవటంపై అసహనం వ్యక్తం చేసారు. 

 

తెలంగాణా చీఫ్  ఎల్.రమణను నిలదీశారు. దానికి ఆయన తాను  పార్టీ పెద్దల సూచనల మేరకే ముందుకు సాగుతున్నాను అని వివరించారు. అయితే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కొత్త నాయకులను తయారుచేసే అవకాశం ఉన్నా ఆ దిశ గా ఎందుకు దృష్టి పెట్ట లేదని నేతలను ప్రశ్నించారు. ఇక నుంచి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉందని. ఆ బలం కొనసాగేలా చర్యలు చేపట్టాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.

 

వచ్చే సంవత్సరం జరగబోయే బల్దియా ఎన్నికలకు ఇప్పటి నుండే  కింద స్థాయి నుండి కృషి చేయాలని సూచించారు. ఏది ఏమైనా తెలంగాణాలో తెలుగు తమ్ముళ్ళను బాగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగానైనా చంద్ర బాబు తెలంగాణా రాజకీయాలను పక్కన పెట్టారు అనే వార్తలకు చెక్ పెట్టినట్లు అయిందని పలువురు అంటున్నారు. ప్రస్తుతం అక్కడ పార్టీ బలపడే అవకాశం లేదనే వార్తలు వస్తున్నాయి. అయినా సరే చంద్రబాబు అక్కడ ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తున్నారు. రాజకీయంగా కూడా ఆ పార్టీకి ఇప్పుడు సరైన బలం లేదు. మరి ఏ విధంగా బలపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: