దురదృష్ట కరం.. ఎన్ని చట్టాలొచ్చినా.. ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా, కామాంధులకు కనువిప్పు కలగడం లేదు.  అవును.. ఇలాంటి ఒక్కో సంఘంటన.. వేరొకరు స్ఫూర్తిగా తీసుకుంటున్నారో ఏమో.. ఇటీవల మహిళలపై అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయి.. పైగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే వరంగల్ నగరంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. 

 

IHG

 

55 ఏళ్ల మహిళపై నలుగురు నడమంత్రపు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మృగాళ్ల చేతిలో అఘాయిత్యానికి గురైన బాధితురాలు ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో మరణం అంచులో కొట్టు మిట్టాడుతోంది. వివరాలు ఇలా వున్నాయి.. సదరు బాధితురాలు వరంగల్‌లోని ఓ గోదాములో పనిచేస్తోంది. ఆదివారం ఆమెను వూరి చివర ఒక నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లిన నలుగురు యువకుడు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది.

 

వారి అధిక అరాచకం వలన బాధితురాలికి అధికంగా రక్తస్రావం అవ్వడంతో వారే స్వయంగా ఆటోలో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారు. ఆమెను గుర్తించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్చి, దగ్గరలో వున్న  పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధిక రక్తస్రావం మూలాన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అక్కడికి చేరువలో వున్న మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

 

IHG

 

ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సదరు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆమెను ఆటోలో ఆస్పత్రి వద్ద వదిలిన వారు, అత్యాచారానికి పాల్పడినవారు...  ఒక్కరేనా? లేదా వేర్వేరా? అనేది తెలియాల్సి వుంది. పోలీసులు దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అన్ని కోణాల్లోనూ.. దర్యాప్తులు చేస్తున్నారు. ఏదిఏమైనా వారికి ఉరి తీసే వరకూ... వదలబోమని, బాధిత కుటుంబ సభ్యులు వారి వేదనను వెళ్లగక్కు తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: