ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులు లాక్ డౌన్ విధానాన్ని పొడిగించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ సంస్థల అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో చాలావరకు ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది అని తెలిపారు. దీనితో పాటు ఉద్యోగులను సిబ్బందిని విధుల నుంచి తొలగించవద్దు  అని కోరడం జరిగింది.

 

 

ఏ ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి లేకుండా చేయవద్దు అని ఐటీ సంస్థల అధినేతలకు లేఖ రాయడం జరిగింది. లాక్ డౌన్ విధానం పూర్తి అయిన తర్వాత అతి త్వరలోనే ఐటి పరిశ్రమలతో పాటు అన్ని రంగాలు కూడా త్వరలోనే మెరుగుపడతాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. దీనితోపాటు శాశ్వత, తాత్కాలిక కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ గా పనిచేస్తున్న ఉద్యోగులు అని ఎవరిని కూడా తొలగించవద్దు అని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించడం జరిగింది.

IHG


ఇటీవల మంత్రి కేటీఆర్ భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఆర్థికపరంగా పడుతున్న బాధల గురించి చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అనుగుణంగా ఎవరిని కూడా నిధుల నుంచి తొలగించవద్దు.. వారిపట్ల చొరవ చూపించాలని మంత్రి కేటీఆర్ కోరడం జరిగింది. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో మంత్రి ఈటల సిఎ సోమేష్ కుమార్ డిజిపి తదితరుల అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: