దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 33,610 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ గురించి, కరోనా వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు జరుపుతున్నారు. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
 
చాలా మందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవడంతో వారు కరోనా సోకినట్లు గుర్తించలేకపోతున్నారు. వారి వల్ల ఇతరులకు వ్యాప్తి చెందుతోంది. ఇలా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ ను కట్టడి చేయడం కష్టమవుతోంది. కరోనా వైరస్ గురించి తెలుసుకోవటానికి ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. చాలా మందికి కరోనా వైరస్ ఎంత బరువు ఉంటుంది అనే ప్రశ్న వేధిస్తోంది. 
 
ఒక డాక్టర్ కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కరోనా వైరస్ బరువు 1 మిలియన్ లో హాఫ్ ట్రిలియన్ గ్రామ్ బరువు ఉంటుందని డాక్టర్ చెప్పారు. 80 మిలియన్ల కరోనా జీవులు శరీరంలోకి ప్రవేశిస్తేనే మాత్రమే కరోనా భారీన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వైద్యులు ఒక కరోనా జీవి బరువు 0.0000005 గ్రాములని చెబుతున్నారు. 
 
అంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీన వారందరిలో ఉన్న కరోనా జీవుల బరువు కేవలం ఒక గ్రాము మాత్రమే. ఈ వైరస్ ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా సోకుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమై లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మరోవైపు ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంటే తెలంగాణలో మాత్రం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏపీలో ఈరోజు 71 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1403కు చేరింది. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: