చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది.  కరోనా వైరస్ ఉద్ధృతి ఇప్పట్లో శాంతించేలా కనిపించడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34 లక్షలు దాటింది. ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద 2,39,566 మంది మృత్యువాత పడ్డారు. 10,80,156 మంది కోలుకున్నారు. ప్రధానంగా అమెరికాలో కరోనా విజృంభణ అత్యంత తీవ్రస్థాయిలో ఉంది.  ఇదిలా ఉంటే.. రష్యాలో కరోనా విశ్వరూపం దాల్చింది. ఆదివారం ఒక్కరోజులోనే 10,600 కొత్త కేసులు నమోదయ్యాయని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. రష్యాలో ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదవడం రికార్డు అని ప్రకటించింది. ఇందులో సగానికి పైగా కేసులు కేపిటల్ సిటీ మాస్కోలోనే ఫైల్ అయినట్లు తెలిపింది.

 

గడిచిన 24 గంటల్లో 58 మంది మృత్యువాత పడగా .. దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి చనిపోయినవారి  సంఖ్య 1,420 కి చేరుకుంది.   ప్రపంచ  వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య  32,56,846గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 20,31,000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు సుమారు పది లక్షల మంది  కోలుకున్నారు. 2,33,388 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ, స్పెయిన్ దేశాలతో పోలిస్తే రష్యాలో మరణాలు రేటు తక్కువగా ఉందని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ మే 12 నుంచి జోన్​ల వారీగా లాక్​డౌన్ సడలింపులు ఇవ్వనున్నట్లు సూచించింది. 

 

ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా రెడ్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాల సీఎస్ లు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు. రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎలా అమలవుతోందన్న దానిపై ఆదివారం సీఎస్ లు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: