ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ కు రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎటువంటి ముందుచూపు లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. తాజాగా ఆయన కడప నగరంలోని గాయత్రి జూనియర్ కళాశాల పైన ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ... ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోను మేము సమర్థిస్తూ ఉన్నాము అని తెలిపాడు. ఎప్పటికైనా రాయలసీమ వాసుల కోసం ఎవరైనా పోరాటం చేస్తే మేము అండగా ఉంటామని తెలియజేశారు. గతంలో పట్టుసీమను ఒట్టిసీమ అని ఎద్దేవా చేసింది వైస్సార్సీపీ  కానీ ఆ పట్టుసీమ లేకపోతే ప్రస్తుతం రాయలసీమకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉండేది.. అని ఎమ్మెల్సీ రవి ప్రశ్నించడం జరిగింది. 

 

ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడు అనుకూలం కాదు అని తెలియజేశారు. అలాగే కడప జిల్లా కోసం చాలా ఉపయోగపడే ప్రాజెక్టు నిర్మాణం కోసం చాలా ఖర్చు చేసిన ఆయన సుప్రీంకోర్టులో ప్రభుత్వం పోరాడాలని కోరడం జరిగింది. జగన్, కేసీఆర్ కలిసి నిర్వీర్యం చేయడానికి ఏమైనా కుట్ర చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఇక గతంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు మళ్లీ మద్యం అమ్మకాలు ఎందుకు మొదలు పెట్టారు అని మండిపడ్డారు.


ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంతో మద్యానికి దూరంగా ఉన్న వాళ్ళని మళ్లీ మద్యానికి బానిసలు అయ్యేలాగా చేశారు అని ఆయన అన్నారు. అలాగే జే టాక్స్ కట్టేవారి బ్రాండ్లు మాత్రమే మధ్య దుకాణాలలో అమ్ముతున్నారు అంటూ తెలియజేశారు. ఇలా చీప్ లిక్కర్ అమ్మడంతో పేద ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది అని తెలిపారు. అంతేకాకుండా పేదల ఆరోగ్యాన్ని నాశనం చేసి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పేరుతో ప్రభుత్వం ఖజానా నింపుకుంటూ ఉంది అని రవి తెలిపారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఎవరూ కూడా సంతోషంగా లేరని తెలిపారు. అలాగే ఆంధ్రాలో విద్యుత్ బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గాలని అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: