చాలా నింపాదిగా మొదలైన కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో లాక్ డౌన్ నుంచి పూర్తిగా సడలింపులు ఇచ్చే సమయానికి చాలా భయంకరమైన రీతిలో విజృంభిస్తోంది. డబ్ల్యూహెచ్వో నుండి రాష్ట్ర ముఖ్య మంత్రుల వరకు ముహూర్తాన మనందరం వైరస్ తో కలిసి సహజీవనం చేయాలి అని అన్నారో.. ఇప్పుడు ప్రజలంతా అలాగే ప్రస్తుతం ఏమాత్రం భయం మరియు బాధ్యత లేకుండా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

 

రోజుకి ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల కేసులు సగటున గత నాలుగు రోజుల నుండి దేశంలో నమోదవుతున్నాయి. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒక కొత్త రికార్డు బద్దలు అవుతోంది. దీనికి కారణం లాక్ డౌన్ ఎత్తివేయడం మరియు ప్రజల్లో స్వేచ్ఛ ఎక్కువ కావడం అన్నది వైద్య నిపుణుల మాట. నాలుగవ దశ లాక్ డౌన్ సడలింపులు ఇవ్వక మునుపు రోజుకి రెండు వేల లోపు కేసులు బయటపడేవి అయితే ఒక్కసారిగా సంఖ్య అమాంతం పెరిగిపోయి దాదాపు తొమ్మిది వేలకు పైగా కేసులు ప్రతిరోజు నమోదు అవుతూ ఉండడంతో కరోనా వ్యాప్తి చాలా ప్రమాదకర స్థాయిలో ఉందని నిపుణులు చెబుతుంటే ప్రభుత్వంలో విపరీతమైన టెన్షన్ మొదలైపోయింది.

 

ఎంత కష్టమైనా సరే మళ్ళీ లాక్ డౌన్ ని చాలా వ్యూహాత్మకంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర రాజధాని ఢిల్లీలో అయితే వైరస్ వ్యాప్తి చాలా ప్రమాదకరంగా ఉందని అంటున్నారు. అంతేకాదు ప్రస్తుత వైరస్ ప్రభావం బట్టి ఢిల్లీ వెళితే వారం రోజులు క్వారంటైన్ అని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చేవారు ఖచ్చితంగా వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: