దూర ప్రయాణాలు చెయ్యడం లో ఆ ఆనందమే వేరు. చాలా మందికి ట్రైన్ జర్నీలను చేయడం ఎంతో ఇష్టం. మామూలుగా చేసే రైలు ప్రయాణాల కంటే కూడా ఈ రైలు ప్రయాణాలు చెయ్యడం మరెంత బాగుంటుంది. ఆ రైలు ప్రయాణాలు ఇవే.... ఈ ప్రయాణాలను చేసే ప్రయత్నం చేయండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఈ రూట్ల లో మీరు చేసే ప్రయాణం మీకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని ఇస్తాయి. ఎంతో ఎగ్జైట్మెంట్ ఈ ప్రయాణాల్లో మీకు దొరుకుతుంది. అవి ఇవే....

ముంబై – గోవా ప్రయాణం ఎంతో బాగుటుంది. పచ్చిక భూములు నుండి సుందరమైన ప్రకృతి దృశ్యాల తో నిండి అద్భుతంగా ఉంటుంది. ఈ మార్గం సొరంగాలు, వంతెనలు, తీరప్రాంతాలు, పశ్చిమ కనుమల గుండా సాగుతుంది. ఈ ప్రయాణ సమయం 14 గంటలు. అబ్బా ఎంత బాగుంటుందో. అలానే మాథరన్ – నెరల్ పాస్ కూడా బాగుంటుంది. భారతదేశంలోని ఉత్తమ రైలు మార్గాల లో ఇది ఒకటి. సమయం కనుక వస్తే అవకాశం వదులుకోకండి.

బెంగుళూరు – కన్యాకుమారి ప్రయాణం కూడా చాలా బాగుంటుంది. దక్షిణ భారతదేశం అందాలను ఈ జర్నీ లో చూడొచ్చు.  రైలు జర్నీ సమయం- 15 గంటలు. మీకు మాల్గుడి డేస్ ను గుర్తు చేస్తుంది ఈ ప్రయాణం. ఇక  రత్నగిరి – మంగుళూరు ప్రయాణం కూడా అదిరిపోతోంది. దట్టమైన అడవులు, లోతైన సొరంగాలు, నదుల వంతెనలు, పెద్ద పెద్ద మలుపులతో ప్రయాణికులను మంత్రముగ్దులను చేసే రూట్ ఇది. మండపం – రామేశ్వరం జర్నీ కూడా బ్రహ్మాండమే. అలానే ఊటీ కి రైలు ప్రయాణం చాలా బాగుంటుంది. 1908 నుండి ఊటీకి ట్రైన్ నడుస్తోంది. నీలగిరి పర్వతం, పెద్దపెద్ద పైన్, ఓక్ మరియు యూకలిప్టస్ అడవులు, వంపులు మరియు సొరంగాల గుండా ట్రైన్ జర్నీ సమయం 5 గంటలు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: