ఆకస్మాత్తుగా హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షాలు, ప్రజలకు ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించడంతో పాటు, నగర జీవితం నరకప్రాయం అనే అభిప్రాయాన్ని కలుగజేశాయి. మొన్నటి వరకు హైదరాబాదులో కరోనా విలయ తాండవం చేసింది. దీని కారణంగా ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు నగరాన్ని వరదలు ముంచెత్తడంతో, సహజంగానే అధికార పార్టీ టిఆర్ఎస్ పై ప్రజల ఆగ్రహం పెరిగిపోతోంది. వరద నష్టం కారణంగా ప్రజలు ఇప్పటికీ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నాలుగు రోజులపాటు చుట్టూ నీళ్లు ముంచెత్తినా, తినేందుకు, తాగేందుకు ఆహారం అందుబాటులో లేకపోవడం ఇలా ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వరద నీరు తగ్గివా, ఆవరణలో మిగిల్చిన బురద ఇళ్లను కమ్మేసింది. ఇప్పుడు ఆ బురదను తొలగించే పనిలో అందరూ నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వాటిని పూర్తిగా తొలగించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.


కొన్ని చోట్ల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తమను పెద్దగా పట్టించుకోవడం లేదు అంటూ ప్రజలు బహిరంగంగానే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,. కొంతమంది ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు సైతం దిగేందుకు సిద్దమవుతుండడం  వంటి పరిణామాలు టిఆర్ఎస్ పార్టీని కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అధికార పార్టీ టిఆర్ఎస్ చూస్తూ ఉండగా, ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావం రావడం, ఈ ఎన్నికలపై ఖచ్చితంగా ఆ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుండటంతో, ప్రజల్లో ఏదో రకంగా ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా చేసుకోవాలని టిఆర్ఎస్ పెద్దలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లలో జరగబోయే ఎన్నికల్లో కనీసం వంద స్థానాలు తమ ఖాతాలో పడతాయని ఇప్పటి వరకు టిఆర్ఎస్ అంచనాలో ఉండగా, ఇప్పుడు ఈ వరద కారణంగా, ఎన్ని సీట్లకు గండి పడుతుందో అనే భయం వెంటాడుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబడే కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలని టిఆర్ఎస్ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చారట.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లలో జరగబోయే ఎన్నికల్లో కనీసం వంద స్థానాలు తమ ఖాతాలో పడతాయని ఇప్పటి వరకు టిఆర్ఎస్ అంచనాలో ఉండగా, ఇప్పుడు ఈ వరద కారణంగా, ఎన్ని సీట్లకు గండి పడుతుందో అనే భయం వెంటాడుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబడే కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలని టిఆర్ఎస్ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: