ఎంత కాదన్నా చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయానికి అసలు సిసలు వారసుడు నారా లోకేష్ అనే చెప్పాలి.... చంద్రబాబు ఏకైక పుత్ర రత్నం అయిన లోకేష్ కి అధికారం కట్టబెట్టి తాను కృష్ణ రామ అనుకుందామనుకున్నాడు కానీ లోకేష్ ప్రవర్తన వల్ల చంద్రబాబు నీరుగారిపోయాడు.. ఒక రాకగం టీడీపీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ముఖ్య కారణం లోకేష్ ని చెప్పాలి.. చంద్రబాబు తర్వాత టీడీపీ లో సరైన నాయకుడే కనిపించడం లేదు.. దాంతో లోకేష్ ని నమ్మే పరిస్థితీ లేదు.. చినబాబు లోకేష్  మామూలుగానే ఓ విషయం పై ఎలాంటి క్లారిటీ లేకుండా, ఎలాంటి పరిజ్ఞానం పెంచుకోకుండానే దాని మీద అనర్గళం గా మాట్లాడాలని ప్రయత్నించి చేతులు కాల్చుకుంటుంటారు..

చంద్రబాబు తన టైం అయిపోయే లోపు కొడుకు లోకేష్ ని రాజకీయంగా బలవంతుడిని చేయాలనీ ప్రయత్నిస్తున్నారు.. ఎంత చేసినా కుక్క తోక వంకరగా ఉండక మానుతుందా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.. మరోవైపు టీడీపీ నేతలు కూడా లోకేష్ ని వ్యక్తిరేకిస్తున్నారు. బలవంతాన లోకేష్ లాంటి వ్యక్తి ని ప్రజలకు రుద్దాలని చూస్తే టీడీపీ కి పుట్టగతులుండవు అని చంద్రబాబు కు ఇన్ డైరెక్ట్ మెసేజ్ లు ఇస్తున్నారు.. ఇది చాల సార్లు అయన మాటల్లో మనం చూశాం.. అయితే ట్విట్టర్ లో అయన చేచే ప్రతి ట్వీట్ లో కూడా ఇలాంటి తప్పే దొర్లింది.. మరి సోషల్ మీడియా లోని ట్రోలర్లు ఊరుకుంటారా.. ఎంత వద్దని చెప్పినా లోకేష్ బాబు ని ట్రెండ్ చేసి పడేస్తారు.

ఇక తాజాగా అయన జనాల్లోకనిపిస్తూ దూసుకెళ్లడం వైసీపీ వర్గాలు ఆశ్చర్యం కలిగిస్తుంది.. లాక్ డౌన్ టైంలో నారా లోకేష్ ఆత్మపరిశీలన చేసుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య అతడిలో చాలా మార్పు కనిపిస్తోంది.  తన లోపాలన్నింటినీ సవరించుకునే పనిలో పడ్డట్లే కనిపిస్తున్నాడు లోకేష్. ముందుగా తన అవతారాన్ని మార్చుకున్నాడు. బాగా సన్నబడి మామూలు స్థాయికి చేరాడు. భాష మీద పట్టు సాధించాడు. బెదురు పోయింది. స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అన్నింటికీ మించి జనాల్లో తిరుగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: