జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపొయింది..గతంలో ఏ పార్టీ కూడా కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ బంపర్ మెజారిటీ తో గెలిచింది.. ఇప్పటికే జగన్ శైలి, దూకుడు స్వభావం అందరికి అర్థమైపోయి ఉంటాయి..మూడు రాజధానుల అంశంపై న మొదట్లో తన సన్నిహిత నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చినా ఆయన మాత్రం తొణకకుండా అదే పంథాలో వెళ్లారు ఫలితంగా మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుంది. విశాఖ ని పరిపాలన రాజధాని గా, అమరావతి ని శాసన రాజధాని గా, కర్నూర్ ని న్యాయ రాజధాని గా మలిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. సొంత పార్టీ నేతలకు కూడా జగన్ గురించి పూర్తి గా అర్థం చేసుకునే ఉంటారు..

ప్రతిపక్ష నేతలకైతే జగన్ ఎలాంటి స్వభావుడో అర్థమైపోయింది.. తండ్రి వైఎస్సార్ లాగ మెతకమనిషి కాదని తెలిసిపోయింది..ప్రజలకు కన్నా బిడ్డలా జగన్ సేవ చేస్తూనే అవినీతి బకాసురులు పాలిట యముడవుతున్నాడు..   అవతలివాళ్ళు ఒకటిస్తే తను మూడిచ్చే రకం అని అర్థమయిపోయింది.. ముఖ్యంగా అవినీతి విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.. అవినీతి చేసిన వాళ్ళను ఎంతటి స్థాయిలో ఉన్నా వదిలిపెట్టడం లేదు..  అవినీతి ని వెలికి తీయడంలో గత ముఖ్యమంత్రులెవరు ఆయనకు సాటి రారు అని చెప్పే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు.. ఎందుకంటే గతంలో  ఏ సీఎం ప్రతిపక్ష నేతలపై ఈ విధంగా దాడి చేయలేదు..

తాజాగా అవినీతి అధికారులకు, నాయకులకు చుక్కలు చూపెట్టే విధంగా ఓ ప్లాన్ వేశారు జగన్..  రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదులకు ప్ర‌త్యేక కాల్ సెంటర్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ ప్రారంభించారు. ఎవరైనా లంచం అడిగితే 14400కి కాల్ చేయొచ్చని సూచించారు. టౌన్‌ ప్లానింగ్, సబ్‌ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ‌ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకుండా ప‌క‌డ్బందీ వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్ రూపొందించారు. ఏపీలో అవలంబిస్తున్న ఈ విధానాల‌న్నీ జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఏదేమైనా జగన్ అవినీతి ని అంతమొందించడానికి ఓ చక్కటి ఆలోచన చేశారని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: