ఏపీ లో జగన్ కు చంద్రబాబు వంటి నేతలే ఎదురు చెప్పే సాహసం చేయట్లేదు కానీ  రాష్ట్రంలో మరో ప్రతిపక్షం గా నిమ్మగడ్డ రమేష్ తయారయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ప్రభుత్వం పై కోర్టు కెక్కిన ఎన్నికల కమిషనర్ గా రికార్డులకెక్కారు రమేష్.. గతంలో ప్రభుత్వ వ్యతిరేఖ పనులు చేస్తూ ఎన్నికల కమిషనర్ గా తొలగించబడ్డ నిమ్మగడ్డ కోర్టు లో దాదాపు నాలుగు నెలలు పోరాడి తిరిగి ఆ పదవిని పొందాడు.. పదవిలోకి చేరగానే ప్రభుత్వం పై కక్ష్య గట్టినట్లు వ్యవహరించడం వైసీపీ వర్గాల్లో కొంత ఆందోళన కలిగించింది..

నిమ్మగడ్డ తో బీజేపీ, టీడీపీ పార్టీ ల నేతలు టచ్ లో ఉండి ఇదంతా చేస్తున్నారని అందరికి తెలిసినా ఎన్నికల కమిషనర్ పారదర్శకంగా ఉండాలనే కనీస అవగాహనా ఆయనకు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.. ప్రభుత్వం పై విమర్శలు చేస్తే పాపులారిటీ వస్తుందనే ఆలోచన తో అయన ఇలా చేస్తున్నాడని అర్థమయిపోతుంది. ఇక దానికి తోడు కోర్టు ల్లో కేసులు పెడితే కేంద్రంలో కూడా తన పేరు వినపడుతుందని కేంద్ర పెద్దల మెప్పుకోసం అయన ఇదంతా చేస్తున్నాడని క్లియర్ గా తెలిసిపోతుంది.  అయితే నిమ్మగడ్డ కు మొన్నటి కోర్టు విజయం కొంత తలకెక్కినట్లుంది.. దాంతో తనేం చేసినా చెల్లుతుందని ఇష్టం వచ్చినల్టు చేస్తూ పోతున్నాడు.. దాని వైసీపీ అడ్డుకుంటుందని మళ్ళీ తోకజాడించే ఆలోచన చేస్తున్నాడు..

స్థానిక ఎన్నికల విషయంలో మళ్ళీ అదే అదే తప్పు చేస్తున్నాడు నిమ్మగడ్డ.. ప్రభుత్వం చెప్పే విధంగా చేయకుండా ఒక రకంగా వైసీపీ ఫై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నాడు.. న్యాయవ్యవస్థ సూచనల మేరకు ఆయన అడుగులు వేయడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ టార్గెట్ గా ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారం మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవస్థలను శాసిస్తున్నారని, తన చేతిలో ఉన్న అధికారాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఒక వర్గం మీడియా కాస్త అతిగా ప్రచారం చేయటం మొదలుపెట్టింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: