కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు అందరికీ సమ న్యాయం చేస్తూ చేయూత అందించే విధంగా ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభం సమయంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే పలురకాల ఉద్దీపన  ప్యాకేజీలను ప్రకటిస్తూ అందరికీ అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం చిన్న తరహా వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. ప్రస్తుతం కరోనా  వైరస్ సంక్షోభం సమయంలో ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు చిన్నతరహా వ్యాపారూ లను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


 చిరు వ్యాపారులను ఆదుకునేందుకు  ఒక సరికొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు మోదీ సర్కార్ నిర్ణయించింది. పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం.. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు అందరికీ ఆర్థికంగా అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న చిరువ్యాపారులు అందరికీ ఈ పథకంలో భాగంగా కొంతమేర రుణ సదుపాయాన్ని కల్పించి ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త సంక్షేమ పథకాన్ని తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.



 పీఎం కిసాన్ నిధి పథకాన్ని నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.  అనంతరం లబ్ధిదారుల అందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.  నేడు పథకం ప్రారంభించిన అనంతరం మూడు లక్షల మంది బీడీవీధి వ్యాపారులకు ఈ పథకంలో భాగంగా రుణాలు పంపిణీ చేయనుంది కేంద్రప్రభుత్వం.  అయితే రోడ్ సైడ్ బండి లేదా వీధి రహదారులపై దుకాణాలు నడిపే  వారికి మాత్రమే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలు  వర్తిస్తాయి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించే వారికి ఏడు శాతం వడ్డీ రాయితీ కూడా లభించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: