మన దేశంలో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే చాలా వరకు కూడా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను ఎంత బాగా అమలు చేస్తే రాష్ట్రంలో అంత బాగా ప్రజల్లో మద్దతు ఇచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితోనే అప్పులు చేసి మరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో కీలక అడుగులు వేస్తున్నాయి.

అయితే ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాత్రం భవిష్యత్తులో కాస్త జాగ్రత్తగా వ్యవహరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు అడుగులు వేసే సూచనలు కనబడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్న నేపథ్యంలో ఆ అప్పులు తలకుమించిన భారంగా మారుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో కాస్త జాగ్రత్తగా హామీలు ఇవ్వాలని భావిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లాలని చూస్తోంది.

సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను భారీగా ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థ పని అయిపోయిందని... ప్రతి ఒక్కరి మీద ఈ స్థాయిలో అప్పులు ఉన్నాయి అని దీని ద్వారా రాష్ట్రంలో పన్నులు పెంచే అవకాశం ఉంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా భారతీయ ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతారు అనే విషయాన్ని కూడా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. అయితే ఈ ఈ ప్రభావం ఇతర  రాష్ట్రాల మీద పడకుండా కేంద్రం మాత్రం కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: