రాష్ట్రాభివృద్ధి లో భాగంగా జగన్ మూడు రాజధానులను సృష్టించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా నిర్ణయం తీసుకున్నాడు.. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుపరుస్తూ ఎంతో సమర్ధవంతమైన పాలనను అందిస్తున్నాడు..అయితే దీన్ని టీడీపీ నేతలు తమకు అనుగుణంగా చెప్పుకుంటున్నారు.. అమరావతి ప్రజలకు ద్రోహం చేశాడని టీడీపీ వర్గాలు అమరావతి లో ప్రచారం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో వైసీపీ దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.. అమరావతి పై వైసీపీ స్పష్టమైన వైఖరి తో ఉంది.. టీడీపీ  చెప్పేవన్నీ ఒట్టి అపోహలు, టీడీపీ తమ రాజకీయ ఉనికిని చాటడానికి ఇలా అబద్ధపు ప్రచారకం చేస్తున్నారు అని చెప్తూ అమరావతి ప్రజలను అక్కున చేర్చుకునేది తమ ప్రభుత్వం అని చెప్తున్నారు..

అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అక్కడి ప్రజలకు తమ తరపున భరోసా ఇచ్చేనందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.. వాస్తవానికి అమరావతి లో పోరాటం చేసేది రైతులు కాదు టీడీపీ నుంచి లాభం పొందిన కొందరు భూబకాసురులు అని వైసీపీ వారు వాదిస్తున్నారు.. ఇక చంద్రబాబు ను, అయన అవలంభిస్తున్న విధానాలను సొంతవారే విమర్శించే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని చెప్పొచ్చు..జగన్ ఇప్పుడు అవలంభిస్తున్న ఓ విధానాన్ని చంద్రబాబు అప్పుడే పాటించి ఉంటే టీడీపీ కి ఈ దుస్థితి వచ్చేది కాదని అంటున్నారు..

నిజానికి బీసీలకు ఏపీ ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రాధాన్యం తెలిసిందే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ నేత పిటిషన్‌ కారణంగా రిజర్వేషన్లను హైకోర్టు తగ్గించినప్పటికీ వైఎస్‌ జగన్‌ స్థానిక ఎన్నికల్లో తన పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అలాగే 139 బీసీ కులాలకు గానూ ప్ర‌స్తుతానికి 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు ఛైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. అయితే తన హయంలో బీసీ లను పట్టించుకోని చంద్రబాబు కు ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేశామో అర్థం అవుతుంది అని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: