వైసీపీ పార్టీ 151 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది.. ఇంత బంపర్ మెజారిటీ తో పార్టీ గెలిచి ఇప్పటికి సంవత్సరంన్నర దాటిపోయింది. అయితే ఇప్పటివరకు అయితే జగన్ చేసే పనులకు ఎలాంటి బ్యాడ్ నేమ్ అయితే రాలేదు కానీ పార్టీ కొంతమంది నేతల మధ్య మాత్రం జగన్ వైఖరి తో విసిగిపోయారని వార్తలు బయటకి వస్తున్నాయి.. జగన్ ప్రవర్తనతో వారు తీవ్ర అసంతృప్తికి కూడా లోనవుతున్నారట.. అయితే సొంత నేతలతో జగన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడన్నది ఇంకా తెలియలేదు. ఎందుకింత మొండిగా జగన్ ఉన్నారని పార్టీ ని ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పట్లేదట. పాలనా లో బిజీ గా ఉంటున్నాను అని చెప్పే జగన్ కనీసం సొంత ఎమ్మెల్యేలను కలిసే టైం కూడా ఇవ్వడకపోవడం ఒకింత విమదాస్పదమైంది.

నేతల్లో ఇంతటి అసంతృప్తి గతంలో ఏ పార్టీ కూడా లేదని చెప్పాలి. చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ నియోజకవర్గాల్లో అంత అసంతృప్తి తలెత్తలేదు. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలను ఒకటి చేశారు. కర్నూలులో బద్ధ విరోధులైన సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తిల కుటుంబాన్ని ఏకం చేశారు. 23 నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి చెలరేగినా చంద్రబాబు సర్దుబాటు చేయగలిగారు. ఇదంతా చంద్రబాబు అనుభవం వల్లనే సాధ్యమయింద. కానీ జగన్ మాత్రం ఆ దిశగా చేసిన ప్రయత్నాలు లేవనే చెప్పాలి.

అయితే ఇక్కడ చంద్రబాబు కి జగన్ తేడా ఏంటంటే చంద్రబాబు ఏం చేసినా పార్టీ క్యాడర్ ని సంప్రదించి, చర్చించి, ఒప్పించి మరీ నిర్ణయాలు తీసుకునే వారు కానీ జగన్ ఇక్కడ చేరికల విషయంలో సొంత పార్టీ నేతల అభిప్రాయాలూ తీసుకోకపోవడం వారి అసంతృప్తి కి తీవ్రమైన కారణంగా చెప్తున్నారు. జగన్ ఇప్పుడు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అనధికారికంగా వైసీపీలోకి చేర్చుకున్నారు. కానీ చేర్చుకునే ముందు అక్కడ స్థానిక వైసీపీ నేతలతో జగన్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ నేతలకు సఖ్యత కొరవడింది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 70 నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్యనే విభేదాలు తలెత్తాయి. దీనికి ప్రధాన కారణం జగన్ ఎమ్మెల్యేలతో సమావేశం కాకపోవడమే. పాలనలో బిజీగా ఉన్నానని చెబుతున్న జగన్ కనీసం వారానికి ఒకసారి ఒక జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యే వీలుంది. కానీ జగన్ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు.  మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: