మళ్లీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వాతావరణం చల్లగా ఉండటం తో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇక మన దేశంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండడం,  జనాల్లో భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు అప్రమత్తతతో వ్యవహరిస్తూ, ముందస్తు జాగ్రత్తలను చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే ఢిల్లీ వంటి చోట్ల లాక్ డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా జనాల్లో కరోనా భయం కాస్త తగ్గడం తో, మళ్లీ ఈ మహమ్మారి విజృంభిస్తున్నట్టు గా కనిపిస్తోంది. 



ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. ముఖ్యంగా కేరళ , ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా వచ్చినా ఎదుర్కొనే విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ,  మాస్కులు ధరించడం తో పాటు భౌతిక దూరం పాటించాలని కేసీఆర్ కోరారు. ఈ  సమావేశం లో
కీలక శాఖల అధికారులు అంతా పాల్గొన్నారు.



 ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... " ఇప్పుడైతే రాష్ట్రంలో కరోనా కంట్రోల్ లో ఉంది.  కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. టెస్ట్ ల సంఖ్య పెంచినా, కేసులు పెరగడం లేదు. అయినప్పటికీ చలికాలం కాబట్టి కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.ప్రస్తుతం రాష్ట్రంలో పదివేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి , అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వస్తే ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బంది కి వేస్తాం'' అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: