ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు సీఎం జగన్ కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల తీరు విషయంలో కాస్త సీరియస్గా ఉన్నారు అని ప్రచారం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా దూకుడుగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో ఇప్పుడు ఆయన కాస్త సీరియస్ గానే ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంతమంది నేతల నోటి దూలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు అనే వ్యాఖ్యలు సీఎం జగన్ వద్దకు చేరుకున్నాయి. దీనితో కొంతమందికి ఆయన నేరుగా ఫోన్ లు  చేస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య గొడవలు ఉంటున్నాయి.

దీనివలన పార్టీ కార్యకర్తలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ బలంగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యలు ఎంతమాత్రం కూడా మంచిది కాదు అనే భావన సీఎం జగన్ వ్యక్తం చేస్తున్నాను. తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన ఒక సంఘటన పార్టీ ని బాగా ఇబ్బంది పెట్టింది. మంత్రి బొత్స సత్యనారాయణ వెనక్కి వెళ్లిపోవాలని అక్కడున్న కార్యకర్తలు డిమాండ్ చేయడం చూసి మీడియా కూడా షాక్ అయింది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అక్కడకు వెళ్లి పరిస్థితి చూసి కూడా ఇప్పటికే అధిష్టానానికి నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం.

ఎమ్మెల్యే ఉషశ్రీ అదేవిధంగా ఎంపీ తలారి రంగయ్య మధ్య విభేదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీనివలన పార్టీ అక్కడ ఇబ్బంది పడుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఇస్తుంది అనే భావన అక్కడి కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా అనంతపురం జిల్లాలో వైసీపీ బలంగా ఉన్నా సరే ఇలాంటి చర్యల ద్వారా అక్కడ పార్టీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం జగన్ కూడా ఈ వ్యవహారం మీద కాస్త సీరియస్ గానే ఉన్నట్టుగా సమాచారం. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఎక్కువగా ఉందని కాబట్టి మీ వలన పార్టీ నాశనం అవుతుందని ఆయన కొంత మంది నేతలకు నేరుగానే చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: