హైదరాబాద్ నగరమంతా ఇప్పుడు ఎన్నికల ప్రచారం తోను, పోలీసు సైరన్ లతో మారు మోగిపోతుంది.. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో నేతలు ఎవరికీ వారే అన్నట్లు పోటీ పడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు..అధికార పార్టీ అయిన టీఆరెఎస్ నేతలు, కార్యకర్తలు నగరం మొత్తం రోడ్ షో లు , ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ నగరమంతా సుడిగాలి పర్యటన చేస్తూ , బీజేపి పై తనదైన స్టయిల్లో సెటైర్లు వేస్తున్నారు. 



ఇకపోతే మంత్రి హరీష్ రావు తో సహా పలువురు నేతలు కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. వీళ్లకు ఏమాత్రం తగ్గకుండా బిజెపి నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇక పోలీసులు మాత్రం ఎక్కడా ఘర్షణలు జరగకుండా భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ఎన్నికలను నిర్వహిస్తున్న ప్రాంతాలను సిపీ సజ్జానార్ పరిశీలించారు. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. బూత్ లను ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలను సీసి కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలని పోలీసులు హెచ్చరించారు. 



ఎన్నికల కోసం మద్యం , డబ్బుల పంపకాలు జరగకుండా అన్నీ చర్యలను తీసుకుంటున్నారు. మద్యం తయారీ, నిల్వలు, వైన్‌షా్‌పల సమయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్సైజ్‌శాఖను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. హైదరాబాద్‌లోని బెల్ట్‌షా్‌పలను వెంటనే మూసేయాలని నిర్దేశించింది. ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్ధసారథి సమావేశాన్ని నిర్వహించారు.అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్‌ 1వ తేది పోలింగ్‌ ముగిసేంత వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.. ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా మద్యం అమ్మకాలను నిలిపివేయాలని సంబంధిత అధికారులను కోరారు..ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలైన శాస్త్రి నగర్ సులేమాన్ నగర్, అత్తాపూర్ లలో మద్యం అమ్మకాల పై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి: