తమిళనాడు రాష్ట్రం మరియు పుదుచ్చేరి లోని కొిన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్ ఏపీలో కూడా బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 8 జిల్లాలు వణికిపోయాయి. ఎడతెరిపి లేకుండా పడిన వానలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిలలాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ నివర్ తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది.. ఈదురుగాలులు, భారీ వర్షాలు అతలాకుతం చేశాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది.. కొన్నిచోట్ల చేతికి అందిన పంట నీట మునిగిపోవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.


ఇదిలా ఉంటే... గుంటూరు జిల్లా మంగళగిరి అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా ఈ నివర్ తుఫాన్ పంట నష్టం కలిగించి చాలా ఇబ్బంది పెట్టిందట.  మొత్తం 14 ఎకరాల చేతికి అందిన వరి పంట పొలం ఇలా ఈ నివర్ తుఫాన్ గాలికి ఒరిగిపాయింది. ఇటీవలే నకిలీ విత్తనాల కారణంగా పొలంలో ఇరవై శాతం నారు సరిగ్గా పెరగకపోవటంతో తన పొలానికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. దీంతో తను వాడినవి నకిలీ విత్తనాలుగా గుర్తించారు.అయితే సదరు విత్తనాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ సీడ్స్ నుంచి కొనుగోలు చేయడంతో గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. ఇక సంబంధిత అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పంటను పరిశీలించారు. ఏపీ సీడ్స్ వారికి కర్నూలు జిల్లా నంద్యాల మంజీరా సీడ్స్ కంపెనీ చెందినవారు సరఫరా చేశారని.. ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను అన్నారు. అలాగే ఏపీ సీడ్స్ దగ్గర కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి బిల్లును కూడా బయటపెట్టారు. అలాంటిది ఇప్పుడు మరలా ఈ నివర్ తుఫాన్ వర్షంతో నష్టం రావటంతో అధికార వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఆవేదన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: