రేవంత్ రెడ్డి పార్టీ మారే అంశం గురించి రాజకీయ వర్గాలలో ఉన్న చర్చలు అన్ని ఇన్ని కాదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. మారతారా లేదా అనే దానిపై స్పష్టత లేకపోయినా సరే కొంత మంది మాత్రం ఎక్కువగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పట్లో పార్టీ మారే అవకాశం లేదు అనే అభిప్రాయాన్ని కొంతమంది వద్ద వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీనికి ప్రధాన కారణం ఏంటనేది తెలియకపోయినా కేంద్ర ప్రభుత్వంపై రైతులు పెద్దఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా పరిస్థితులు కనపడుతున్నాయి.

 కాబట్టి రైతులు ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందా లేదా అనే విషయం స్పష్టంగా తెలియదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు జాగ్రత్తగానే ముందుకు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్రంలో మళ్ళీ బిజెపి అధికారంలోకి రాకపోతే రేవంత్ రెడ్డి అనవసరంగా బీజేపీ లోకి వెళ్ళిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి  వెనక్కు తగ్గే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి మాత్రం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. మరి ఆయన ఏ పార్టీలో కి వెళ్తారు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం సొంత పార్టీ పెట్టుకున్న ఆలోచనలో ఉన్నారని వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనికి సంబంధించి ఆయన ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తీరుపై బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల కూడా ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు. కాబట్టి బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా అనేది చెప్పటం కూడా కష్టమే. తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేక పోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: