జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన  గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం, అందులోని ముఖ్య నేతలు అందరూ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నా రాని క్రెడిట్ పవన్ కళ్యాణ్ సీన్ లోకి ఎంటర్ అయ్యే సరికి మొత్తం సీన్ మారిపోతోంది. పవన్ ఎంట్రీ తో అసలు ఏపీలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏపీ  ప్రజలు. దాంతో ఇదే దూకుడును కంటిన్యూ చేయడానికి పవన్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ సిద్దం చేసుకున్నారట. ఇదిలాఉంటే
పవన్ కు పై భారీ అంచనాలు పెట్టుకున్న బీజేపీ టీడీపీ పతనం తధ్యమని భావించే పవన్ తో జతకట్టడానికి ముందుకు వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంటే కూడా పవన్ కళ్యాణ్ తో ముందుకు వెళ్తేనే ఏపీ రాజకీయాల్లో పాతుకుపోయే అవకాశం ఉందని భావించిన బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ ను బుట్టలో వేసుకుని మెల్లగా వాడేసుకుంటున్నారు. బీజేపీ ఎత్తులు తెలియని జనసేనాని ముందు వెనుకా ఆలోచన చేయకుండా బెజేపీతో చెలిమికి సై చెప్పేశారు. కానీ
ఏపీలో ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్న, ఆందోళనలు చేపట్టాలన్నా మొక్కుబడినా పాల్గొంటూ పవన్ కళ్యాణ్ ను ముందుకు పెడుతోంది బీజేపీ. ఎలాగో ఏపీలో తమకు ఆదరణ  ఉండదని పవన్ పార్టీ చేలిమితోనే ఏపీలో పాతుకుపోవాలనుకుంటున్న బీజేపీ తెలివితేటలను పవన్ గమనించడంతో ఇప్పుడు ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య సీన్ మారనుందట. అందుకు తిరుపతి ఉపఎన్నికలే ప్రధాన కేంద్రంగా మలుచుకోబోతున్నారట జనసేనాని. త్వరలో తిరుపతిలో జరగనున్న ఉప ఎన్నికల్లో పాగా వేగాలని ఉవ్విళ్ళూరుతున్న పవన్ కళ్యాణ్ ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తమ జనసేన పార్టీ నుంచి..

ఉపఎన్నికలకు అభ్యర్ధిని నిలబెట్టి గెలుపించుకోగలిగితే పార్టీ నేతలు అందరూ ఫుల్ జోష్ లో ఉండటమే గాకుండా పార్టీకి మరింత బలం చేకూరుతుందని, భవిష్యత్ రాజకీయాల్లో ఈ ఉపఎన్నికల ప్రభావం తప్పకుండా పార్టీకి మైలేజ్ ఇస్తుందని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. అందుకే తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ తనవైపు నుంచీ అభ్యర్ధిని నిలబెట్టాలని చూస్తున్నా  పవన్ మాత్రం ఏ మాత్రం అందుకు అంగీకారం తెలియజేయడం లేదని, ఈ విషయంలోనే బీజేపీ కి పవన్ కు మధ్య దూరం పెరిగిందని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ నెల 21 న జరగనున్న పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గోననున్నారట. అంతేకాదు ఈ మీటింగ్ లోనే తిరుపతి ఉప ఎన్నికపై ఓ నిర్ణయానికి వచ్చి బీజేపీ కి షాక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారట. పవన్ ఈ నిర్ణయానికే కట్టుబడి ఉంటే ముందు నుంచీ తిరుపతి ఉపఎన్నికపై తమ అభ్యర్ధిని నిలబెట్టి పోటీ చేయాలని అనుకుంటున్నా  బీజేపీ కి ఈ పరిణామాలు బిగ్ షాక్ అనే చెప్పాలి. అంతేకాదు ఈ చాన్స్ గనుక పవన్ వదులుకుంటే తనను తాను ప్రూవ్ చేస్కునే అవకాశం మిస్ అవుతారనేది విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: