తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రధాన సమస్యగా మారారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ విషయంలో ఆయన ముందు నుంచి కూడా దూకుడుగా వెళుతున్నారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో ఆయన చేస్తున్న రాజకీయం తెరాస పార్టీ నేతలకు పెద్ద తలనొప్పి గానే ఉంది అని చెప్పాలి. అయితే టిఆర్ఎస్ పార్టీ విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

టిఆర్ఎస్ పార్టీలో చాలామంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి కొన్ని జిల్లాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చినా సరే ఆ హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు అని చెప్పాలి. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీకి కొంత మంది సహకారం అందిస్తున్న సరే ప్రజల్లో మాత్రం ఆ పార్టీపై అసహనం ఎక్కడా పోవడం లేదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన తెరాస ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని సమాచారం.

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టారని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక ఆధారాన్ని కూడా హైకోర్టులో సమర్పించే అవకాశాలున్నాయని... దీని ద్వారా ద్వారా సీబీఐ విచారణకు డిమాండ్ చేసే అవకాశాలు ఉండవచ్చు అంటున్నారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మీద దృష్టి పెట్టారని వాళ్ళిద్దరూ కూడా అవినీతి కార్యక్రమాలతో పాటు ప్రజలను భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని ఆయన హైకోర్ట్ దృష్టికి ఆధారాలతో సహా తీసుకెళ్లి అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది మీద కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: