దుర్గ‌గుడిలో జ‌రిగిని అవినీతి, అక్ర‌మాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన దాదాపు 13మంది అధికారుల‌ను స‌స్పెన్ష‌న్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్య‌వ‌హారంలో మంత్రి వెల్ల‌ప‌ల్లి నిర్ల‌క్ష్యంపై, మ‌రో కోణాల్లో కూడా ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి. దేవాదాయశాఖ మంత్రి వెల్లిపల్లి శ్రీనివాస్ కు తగలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వెల్లంపల్లిపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి పాత్రపై ఉన్న‌ట్లుగా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కూడా దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. ఖచ్చితమైన సమాచారం కూడా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. దీంతో త్వరలో జ‌రిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయ‌న్ను తొల‌గించేందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.


దుర్గగుడి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లా ఏసీబీ అధికారులే కాకుండా గుంటూరు జిల్లా నుంచి కూడా మరికొంతమంది అధికారులను రప్పించి అన్ని విభాగాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో జరిగిన అనేక అవకతవకలను ఏసీబీ అధికారులు గుర్తించారనే వార్తలు వినిపిస్తుండటంతో దుర్గగుడి ఉద్యోగులు, అధికారుల్లో వ‌ణుకుపుడుతోంది. ఏడాదిన్నరగా ఇంద్రకీలాద్రిపై వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాలు, వివాదాలన్నింటికీ ఈవో సురేశ్‌బాబే కేంద్ర బిందువు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అండతోనే ఇష్టారాజ్యంగా ఆయన చెలరేగిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


ఇదిలా ఉండ‌గా  దుర్గగుడిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు.  దుర్గగుడి అవినీతి విచారణతో అంత మందిని సస్పెండ్ చేసి అసలు సామ్రాట్‌ను వదలడం స్వామి వారి ఆశీస్సులతోనేనా? అని ప్రశ్నించారు.  ఈ దెబ్బతో స్వామి వారి గొప్పదనం రాష్ట్రమంతా పాకిందన్నారు. ఇక అవినీతిపరులంతా స్వామీజీని ఆశ్రయిస్తారేమో చూడాలని వ్యాఖ్యానించారు. అధర్మం రాష్ట్రంలో విజయపధంలో నడుస్తుందిగా? అంటూ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: