తెలుగుదేశం పార్టీని కూడా కొన్ని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రధాన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొన్ని కొన్ని విషయాల్లో తప్పు ఎక్కువగా చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలను కొంతమంది నేతలకు అప్పగించే విషయమై ఆయన చేస్తున్న తప్పులు కారణంగా ఇప్పుడు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది.

ఈ తరుణంలో పార్టీలో కొన్ని కొన్ని జాగ్రత్తలు చంద్రబాబునాయుడు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా సరే చంద్రబాబు కొన్ని సమస్యల మీద ఫోకస్ చేయడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలో ఉన్న సమస్యల విషయంలో కూడా ముందు నుంచి చంద్రబాబు నాయుడు పెద్ద గా దృష్టి పెట్టలేదు. అందుకే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో ఓడిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా ముందుకు వెళ్లాలంటే నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

కానీ ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలకు బాధ్యతలు ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు పార్టీ విషయంలో ముందుకు వెళ్ళలేక పోతున్నారు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఇప్పటివరకు చేయలేదు. దీనికి ప్రధాన కారణం నేతల మధ్య సమన్వయం లేకపోవడం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నేతలకు అసలు కొన్ని కొన్ని సమస్యల మీద అవగాహన కూడా లేదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు కొన్ని సమస్యలను పరిష్కరించలేదు అంటే మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: