ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోగా.. మార్చి 10న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఇటీవల  టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దూకుడు పెంచారు.  ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు. ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. ఘాటు పోస్టులతో రెచ్చిపోతున్నారు నారా లోకేష్. ప్రెస్ మీట్లలోనూ వైసీపీపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా.. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. స్పాట్ కు వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమెచ్చినా నేనున్నాంటూ వాళ్లకు భరోసా ఇస్తున్నారు చినబాబు.

నారా లోకేష్ ను కొన్ని రోజులుగా గమనిస్తున్నవారంతా.. ఆయన బాగా రాటు దేలారని చెబుతున్నారు. ఇంత చేస్తున్నా చినబాబుపై తమ్ముళ్లకు మాత్రం నమ్మకం లేనట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు తర్వాత టీడీపీని లోకేష్ నడపలేడనే భావనలోనే టీడీపీ మెజార్టీ కార్యకర్తలు ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు తాజాాగా కుప్పంలో జరిగిన ఘటనే ఉదాహరణ అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కుప్పం టీడీపీకి కంచుకోట. నాలుగు దశాబ్దాలుగా కుప్పం నుంచి చంద్రబాబు గెలుస్తూ వస్తున్నాయి. ఆలాంటి చోటే... అది కూడా చంద్రబాబు పర్యటనలోనే జూనియర్ ఎన్టీఆర్ జపం వినిపించడం టీడీపీలో కాక రేపుతోంది. చంద్రబాబు ముందే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలంటూ కుప్పం తమ్ముళ్లు నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ఫోటోలను ప్రదర్శించి.. ఆయనకు మద్దతుగా కేకలు వేశారు.

కుప్పం ఘటన తర్వాత రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు వయసు 70కి దగ్గరలో ఉంది. గతంలో లాగా ఆయన చురుకుగా తిరగలేకపోతున్నారు. కరోనా సమయంలో ఆయన బయటికి రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ పైనే పార్టీ భారం పడింది. అయితే చంద్రబాబు తరహాలో టీడీపీని ముందుకు తీసుకెళ్లడం లోకేష్ వల్ల కాదని తమ్ముళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ఈ రకంగా చెప్పారంటున్నారు. దూకుడుగా వెళుతున్న జగన్ ను
ధీటుగా ఎదుర్కొవాలంటే జూనియర్ ఎన్టీఆరే.. సమర్ధుడని టీడీపీ నేతలు కూడా అఫ్ ది రికార్డుగా చెబుతున్నారని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: